/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-9-4.jpg)
Thalapathy Vijay GOAT Movie First Single Telugu Version : కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో తలపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. ఆ మధ్యే 'విజిల్ పోడు' అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ బర్త్ డే కానుకగా 'The GOAT Bday Shots' అనే పేరుతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read : మరో సినిమాను లైన్ లో పెట్టిన వెంకీ మామ.. ఈసారి ‘రానా’ డైరెక్టర్ తో..!
ఇందులో డ్యూయల్ రోల్లో కనిపించారు విజయ్. డ్యూయల్ రోల్లో బైక్ పై విజయ్ యాక్షన్ సీక్వెన్స్, స్టెంట్స్ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. తాజాగా ఈ సినిమాలోని తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. డ్యాన్స్ ఆంథమ్ 'విజిలేస్కో..' పేరుతో రిలీజైన ఈ పాటను యువన్‌శంకర్‌రాజా స్వరపరచగా.. రామజోగయ్యశాస్త్రి రచించారు. హుషారైన బీట్‌తో సెలబ్రేషన్ సాంగ్‌గా ఆకట్టుకుంటున్నది. ఈ లిరికల్ వీడియోలో ప్రభుదేవా (Prabhu Deva), ప్రశాంత్, అజ్మల్ అమీర్‌లతో కలిసి విజయ్ డ్యాన్స్‌లో అదరగొట్టారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేయనుంది.
Make way for the #GOAT ✨#Whistleaesko for the #GOAT 💥💥@actorvijay Sir ❤️🔥
A @thisisysr party
A @vp_offl Hero
Lyrics by Saraswathi Puthra @ramjowrites
Vocals by Yuvan & @AzizNakash#TheGreatestOfAllTime Telugu release by @MythriRelease ❤🔥 pic.twitter.com/LOkGOhoxVi— Mythri Movie Distributors LLP (@MythriRelease) July 12, 2024