Thailand: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం.. ప్రధానిపై వేటు

థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి స్రెత్తా థావిసిన్‌ పై వేటు పడింది. నేరారోపణ ఉన్న ఓ న్యాయవాదిని తన మంత్రివర్గంలో నియమించుకుని నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆయనను కోర్టు పదవి నుంచి తొలగించింది.

New Update
Thailand: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం.. ప్రధానిపై వేటు

Srettha Thavison: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ ప్రధాని (Thailand Prime Minister)  స్రెత్తా థావిసిన్‌పై వేటు పడింది. అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం ఆయన్ని పదవిలో నుంచి తొలగించింది. ఓ కోర్టు అధికారికి లంచం ఇచ్చేందుకు యత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన క్యాబినేట్‌ సభ్యుడి నియామకానికి సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఆయనను పదవి నుంచి తీసేసింది. అంతేకాదు ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే విపక్ష పార్టీని రద్దు చేయాలని ఇటీవలే ఆ కోర్టు ఆదేశించింది. ఇలా జరిగిన కొన్ని రోజులకే థాయ్‌లాండ్‌ ప్రధానిపై వేటు పడటం గమనార్హం.

Also Read: వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డ పై హక్కు ఉండదు!

అయితే ప్రధాని పదవి నుంచి స్రెత్తా థావిసన్‌ను తొలగించిన నేపథ్యంలో డిప్యూటీ ప్రధాని, వాణిజ్య మంత్రి ఫుమ్థమ్‌ వెచయాచై తాత్కాలిక ప్రధాని పదవి చేపట్టనున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో రాజకీయ సమీకరణలు మారడంతో స్రెత్తా థావిసిన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే స్రెత్తాకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. గతంలో నేరారోపణ ఉన్న న్యాయవాది పిచిట్ చుయెన్‌బాన్‌ను తన మంత్రివర్గంలో నియమించినందుకు రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు 2008లో కోర్టు ధిక్కారానికి సంబంధించి చుయెన్‌బాన్‌.. కొంతకాలం జైలు పాలయ్యారు. అయితే స్రెత్తా థావిసిన్‌పై వచ్చిన లంచం, అవినీతి ఆరోపణలు ఇప్పటిదాకా రుజువు కాలేదు. మరోవైపు కోర్టు తీర్పుపై స్రెత్తా స్పందించారు. దేశ అవసరాలకు అనుగుణంగానే తాను కేబినేట్ నియామకాలు చేపట్టానని పేర్కొన్నారు. అలాగే ప్రజల అవసరాలకు తగ్గట్లే పనిచేశానని తెలిపారు.

Also Read: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

Advertisment
తాజా కథనాలు