టూరిస్టులను థాయ్‌లాండ్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్, తైవాన్ దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించనుంది. సీజన్ దగ్గరికొస్తున్న వేళ.. ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ నిర్ణయం వల్ల భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులు వీసా లేకుండానే 30 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో పర్యటన చేయవచ్చని చెప్పారు. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది మే వరకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది సీజన్‌లో దాదాపు 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రయాణ రంగం నుంచి వచ్చే ఆదాయంతో ఆర్థిక వృద్ధికి అడ్డుగా మారిన లోటును భర్తీ చేయాలని చూస్తోంది.
Also read: భూతల దాడులు మరింత ఉధృతం..ఇజ్రాయెల్ ప్రధానికి జో బైడెన్ ఫోన్..ఇలా చేయాలంటూ సూచన.!
ఇదిలాఉండగా.. థాయ్‌లాండ్‌కు మలేషియా, దక్షిణ కొరియా, చైనా తర్వాత ఇండియా నుంచే పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. జనవరి-అక్టోబర్ మధ్య థాయ్‌లాండ్‌కు దాదాపు 22 మంది మిలియన్ల సందర్శకులు వచ్చారు. దీనివల్ల దేశానికి భారీ ఆదాయం వచ్చింది. ఇక 2019లో 39 మిలియన్ల టూరిస్టులు వచ్చారు. ఇందులో 11 మిలియన్ల సందర్శకులతో చైనా టాప్‌లో నిలిచింది. కరోనా తర్వాత తమ పర్యాటక రంగానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టిన చైనీస్ పర్యాటకుల కోసం సెప్టెంబర్‌లో వీసా అవసరం లేకుండానే పరిమిత కాల పర్యటనకు అవకాశం ఇచ్చింది థాయ్‌లాండ్.