Telangana : తెలంగాణలో అప్పటి వరకు వర్షాలే.. ఐఎండీ కీలక ప్రకటన!

జూన్‌ 23 వరకు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!
New Update

Telangana Rain Forecast : జూన్‌ 23 వరకు కూడా తెలంగాణ (Telangana) లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ , ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert) ను జారీ చేసింది. అలాగే, ఈ నెల 18 నుంచి 24 ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు సిద్దిపేట, సంగారెడ్డి, భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మంతో పాటు పలు జిల్లాలతో పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

Also read: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ నటి.. గ్రాండ్‌గా వెల్ కమ్ చెప్పిన ఫ్యామిలీ: వీడియో

#hyderabad #rains #imd #weather
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి