Health Tips: ఉదయం లేవగానే టీ తాగనిదే చాలా మందికి ఏమీ తొచదు. ప్రతి ఒక్కరూ రోజులో ఏదో ఒక సమయంలో పాలు వాడతారు. అయితే మార్కెట్‌లో పాలు అనేక రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలు ఏ పాలు తాగాలి, పెద్దలు ఏ పాలు తాగాలి అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. సాధారణంగా మనలో చాలా మంది ఉదయాన్నే లేచి బయటికి వెళ్లి పాల ప్యాకెట్లు తీసుకొస్తుంటారు. కొందరు గేదె లేదా ఆవు నుండి తీసిన స్వచ్ఛమైన పాలను ఉపయోగిస్తారు, మరికొందరు టెట్రా ప్యాకెట్ పాలను వాడుతుంటారు.గేదె లేదా ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పాలలో కల్తీ ఉండదు. అంతేకాకుండా పాశ్చరైజ్ చేయని పాలు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
టెట్రా ప్యాక్:
- ఏ పాలు మంచిదనే విషయానికి వస్తే టెట్రా ప్యాక్‌ను అల్ట్రా-హై టెంపరేచర్ పద్ధతిలో తయారుచేయడం వల్ల ఆ పాలు సురక్షితమైనవని అంటున్నారు. పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి చల్లార్చి ప్యాక్ చేయడం వల్ల పాలలోని మైక్రోమాక్స్, వ్యాధికారక క్రిములు నశిస్తాయి కాబట్టి ఆ పాలను తాగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఈ పాలు సులభంగా చెడిపోవు, ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంటాయి.
సాధారణ పాల ప్యాకెట్:
- కొందరు మామూలు పాల ప్యాకెట్లు వాడుతుంటారు. పాల ప్యాకెట్ కొంత ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే పాశ్చరైజ్ చేయబడుతుంది. దానివల్ల సూక్ష్మజీవులు మాత్రమే నశిస్తాయి. కానీ వ్యాధికారకాలు నశించవు. అందుకే ఆ పాల ప్యాకెట్ లైఫ్‌టైమ్ కూడా తక్కువగా ఉంటుంది. కేవలం రెండుమూడు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి.
- ఒకవేళ మీరు 24 గంటల్లోపు పాలను వినియోగిస్తే మాత్రం మామూలు పాల ప్యాకెట్ తెచ్చుకోవచ్చు. అదే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే టెట్రా పాక్ తెచ్చుకోవచ్చు.
ఎలాంటి పాలను తీసుకోవద్దు:
కొందరు పాలల్లో నురుగు రావడానికి అనేక రకాల డిటర్జెంట్లు, కెమికల్స్ వాడుతున్నారు. ఇలాంటి పాలను మన పిల్లలకు ఇస్తే వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు. అందుకే బ్రాండెడ్ కంపెనీల పాలనే కొనుగోలు చేయాలని, అవసరమైతే గేదెలు ఉన్నచోటుకు వెళ్లి పాలను కొనుగోలు చేయాలని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: గర్భిణులు యాంటీ బయోటిక్స్ వేసుకోవచ్చా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: ఈ ప్రదేశాలలో మీ మొబైల్‌ని వాడకండి