TS TET 2024: టెట్ నోటిఫికేషన్ విడుదల

టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. మే 20, జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించనుంది. టెట్ పరీక్షల నేపథ్యంలో జూన్ 6 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనుంది. 

TS: టీచర్లకు తెలంగాణ సర్కార్ షాక్..  ఆ డిమాండ్ కు నో!
New Update

TS TET Notification 2024: టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. మే 20, జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించనుంది. టెట్ పరీక్షల నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తుల గడువును పొడిగించింది. జూన్ 6 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనుంది.

టెట్ పరీక్షకు రేవంత్ సర్కార్ ఒకే..

టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. DSC కి ముందు టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 3 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి డీఎస్సీ కి ముందు టెట్ పరీక్ష నిర్వహించాలని టెట్ అభ్యర్థులు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలపై మంత్రి రాజనర్సింహ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు భేటీ అయినా సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 

11,062 పోస్టులతో మెగా డీఎస్సీ.. 

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నిన్న పాత నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), 2,629 స్కూల్ అసిస్టెంట్లు (SA), 727 లాంగ్వేజ్ పండిట్లు (LP), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET), 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 220 పోస్టులు, 79 SA క్యాడర్ కింద ఖాళీలు ఉంటాయి. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు

#cm-revanth-reddy #ts-tet-2024 #telangana-dsc-notification-2024 #tet-notification-released
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe