Robo:తిరగబడ్డ రోబో.. టెస్లా ఇంజనీర్ పై రక్తం వచ్చేలా దాడి.. అసలేమైందంటే? కొంతకాలం క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ రోబో సినిమాలో తప్పుడు ప్రోగ్రాం అమర్చడం వల్ల మంచి రోబో కాస్త విలన్ రోబోలా తయారవుతుంది. ఇప్పుడు తాజాగా రోబో తన సాఫ్ట్‌వేర్ ను మార్చుతున్న ఇంజినీర్ ని చితకబాదింది ఓ రోబో. ఈ ఘటన టెస్లా కంపెనీలో చోటు చేసుకుంది. By Bhavana 28 Dec 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన రోబో (Robo) సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కదా..!. అందులో చిట్టి రోబోకి విలన్ తప్పుడు ప్రోగ్రాం అప్ డేట్ చేయడం వల్ల చిట్టి రోబో ఎంతటి బీభత్సన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. తనను తయారు చేసిన సైంటిస్ట్ మీదకే కత్తి దూస్తుంది. అంతేకాకుండా కనిపించిన వారందరినీ చంపి పడేస్తుంది కూడా. అయితే తాజాగా టెస్లా (Tesla) కంపెనీకి చెందిన ఓ రోబో కూడా చిట్టి రోబోను తలపించింది. మరీ సినిమాలో చేసినట్లు చేయకపోయినప్పటికీ తన సాఫ్ట్ వేర్ (Software) ను అప్‌డేట్ (Update) చేసే ఓ ఇంజినీర్ ను కిందపడేసి తొక్కినట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సంఘటనలో ఆ ఇంజినీర్ తీవరంగా గాయపడినట్లు సమాచారం. అయితే ఈ ఘటన రెండు సంవత్సరాల క్రితం జరగ్గా తాజాగా బయటకు వచ్చింది. దీంతో రోబోల పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం..అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న టెస్లా గిగా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. టెస్లా గిగా ఫ్యాక్టరీలో కొన్ని పనులకు రోబోలను వినియోగిస్తున్నారు. కారు విడిభాగాలను తయారు చేసేందుకు అల్యూమినయం ప్లేట్లను కట్ చేసేందుకు , మరికొన్ని ఇతర పనులు చేసేందుకు రోబోలను వాడుతుంటారు. ఈ క్రమంలోనే ఇంజినీర్ ఓ రోబోకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంజినీర్ తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు వివరించారు. అయితే దీని గురించి మాట్లాడానికి టెస్లా కంపెనీ అధికారులు నిరాకరించారు. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే..ఈ ఘటన 2021లో జరిగినట్లు తెలుస్తుంది. సాఫ్ట్‌వేర్ ను అప్‌డేట్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది..కానీ అప్‌డేట్ చేసే సమయంలో రోబోలను ఇన్ యాక్టివ్ చేయాలి..ఈ క్రమంలోనే 3 రోబోలను ఇన్ యాక్టివ్ చేయగా ఓ రోబో సడెన్ గా యాక్టివ్ అయినట్లు అధికారులు తెలుపుతున్నారు. దీంతో అది ఆ ఇంజనీర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఆ ఇంజినీర్‌ను కింద పడేసి.. తొక్కి పట్టిందని.. దీంతో రోబోకు ఉన్న పదునైన భాగాలు ఆ ఇంజనీర్ వీపులోకి గుచ్చుకున్నాయని.. అతని చేతికి కూడా తీవ్ర గాయం అయినట్లు తెలిపింది. ఈ ఘటనతో ఆ ఫ్యాక్టరీలోని ఫ్లోర్‌పై రక్తం భారీగా పోయిందని నివేదిక తెలిపింది. తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు టెస్తా కంపెనీ ఉద్యోగులు కొందరు ఆరోపించారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఉద్యోగులు ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. Also read: న్యూఇయర్ లోనూ భారీగా భారీ లేఆఫ్‌లు.. ఉద్యోగులకు షాకిచ్చిన లేటెస్టే సర్వే! #tesla #attack #robo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి