/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-12T103909.750-jpg.webp)
Trivikram Srinivas : టాలీవుడ్(Tollywood) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా ఆయన తెరకెక్కించిన 'గుంటూరు కారం'(Guntur Kaaram)మూవీ ఈరోజు విడుదలవగా.. థియేటర్ల దగ్గర ప్రిన్స్ అభిమానులు రచ్చ చేస్తున్నారు. అయితే ఈ మూవీ చూసిన ఫ్యాన్స్ హీరో, డైరెక్టర్ ను తెగ పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం దారుణంగా విమర్శలు చేస్తున్నారు.
Ramana Gaadu 🔥❤️😍 #maheshbabu #maheshbabufans #sreeleela #TrivikramSrinivas #GunturKaaramReview #RamanaGadiMassJaathara #RamanaGadiRampage pic.twitter.com/hNduUVCFX7
— Animutyam (@Dubidi_Dhibide) January 12, 2024
మహేష్ బాబు అందం తప్పా ఇందులో కొత్తగా ఏమీ లేదని, రెండు, మూడు సినిమాల స్టోరీలు రంగరించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారంటూ దర్శకుడిపై మండిపడుతున్నారు.
Inka Movies teeyadam maney ra Lucha #TrivikramSrinivas ; #GunturKaaram #GunturKaraam #Hanuman #GunturuKaaram pic.twitter.com/dlO8hCZtUI
— #Loki (@LC_getme) January 12, 2024
Also Read : Guntur Kaaram: JSP + TDP = JDP 😂😂 గురూజీ మార్క్ కండువా!
ఈ సినిమాలో 'అజ్ఞాతవాసి', 'అలా వైకుంఠపురంలో'స్టోరీలు రిపీట్ చేశారని ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఇది 'గుంటూరు కారం' కాదు 'గుంటూరు ఘోరం' అంటూ ఆడేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ టికెట్ మతడబెట్టి జేబులో పెట్టుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Fans to Guruji: Audience meedha Revenge haa anna #MaheshBabu𓃵#GunturKaraam#Trivikram#TrivikramSrinivas pic.twitter.com/CN1GZL1mPb
— Prem Dadwadia (@PremDadwadia) January 12, 2024
ఇప్పటికే కుర్చీ మడతపెట్టి, ఓ మై బేబీ సాంగ్స్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరగగా.. ఇప్పుడు సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథలో మెయిన్ పాయింట్స్ మొత్తం త్రివిక్రమ్ కాపీ చేసారని ఆరోపిస్తున్నారు.
Mahesh Babu - Trivikram Srinivas - Prakash Raj... over two decades. pic.twitter.com/i0wNXe6Ag5
— Chay! (@illusionistChay) January 7, 2024
ఇక ఇటీవలే యద్దనపూడి సులోచన రాణి రచించిన నవల 'కీర్తి కిరీటాలు'లోని కొన్ని పాయింట్స్ కాపీ చేశాడని ఫ్యాన్స్ ఆరోపించారు. ఇప్పుడు పాత సినిమాల కథలను ఇందులో కలిసి విసిగించాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
#Trivikram #TrivikramSrinivas pic.twitter.com/gx7jYnhKaZ
— AAkAAsh 🐉🐲🪓 (@CultAAkash) January 12, 2024
ఇక సినిమాకు ముందు 'గురూజీ ఏమైనా చేయగలరు, దాని నుంచి తప్పించుకోవడం కూడా తెలుసు. ఆయన ఎలాంటి తప్పుడు పనులు చేసినా గుడ్డిగా మద్దతు తెలిపే జనాలు ఉన్నారు. అయినా కూడా ఆయనకి గత ప్రభుత్వంలో సీఎం ఆఫీస్ లకి నేరుగా వెళ్లే అనుమతి ఉండేది. సామాన్య ప్రజలకు లేని ఆ అవకాశం ఆయనకి మాత్రమే ఎందుకో అర్థం కాదు. గురూజీ థింగ్స్' అంటూ పూనమ్ కౌర్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read : రౌడి రమణ సినిమా స్కోపు .. 70MM..మిర్చీ యార్డులో చెలరేగిపోయన మహేష్