Gangavaram Port: గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..పోలీసుల హై అలర్ట్‌!

సుమారు 45 రోజుల నుంచి ఆందోళనలు చేపట్టినప్పటికీ కూడా కనీసం పోర్టు యజామాన్యం నుంచి కనీస స్పందన రాలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గురువారం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపుని ఇచ్చాయి. దీంతో గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

New Update
Gangavaram Port: గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..పోలీసుల హై అలర్ట్‌!

Gangavaram Port : విశాఖ పట్టణం లోని అదానీ గంగవరం పోర్టు వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే 45 రోజుల నుంచి పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పని చేసినందుకు కనీస వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు.

సుమారు 45 రోజుల నుంచి ఆందోళనలు చేపట్టినప్పటికీ కూడా కనీసం పోర్టు యజామాన్యం నుంచి కనీస స్పందన రాలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గురువారం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపుని ఇచ్చాయి. దీంతో గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

గంగవరం పోర్టుకు (Gangavaram Port) వెళ్లే మార్గాలను మూసి వేశారు పోలీసులు. దీంతో పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను దూకి మరి కార్మికులు పోర్టు వైపునకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కార్మికులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.దీంతో
పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసులను తోసుకుంటూ పోర్టులోకి వెళ్లేందుకు కార్మికులు యత్నించారు.ఈ సమయంలో కొందరు పోలీసులు కిందపడిపోయారు. ఈ క్రమంలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. గాజువాక సీఐ కాలికి ముళ్ల కంచె గుచ్చుకోవడంతో గాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్ల తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

రాజకీయ పార్టీల మద్దతు:

గంగవరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చిన కార్మికులకు పలు పార్టీలు మద్దతు పలికాయి. వామపక్షాలు, కాంగ్రెస్ (Congress), వైసీపీలు (YSRCP) మద్దతు పలికాయి. కార్మికులతో కలిసి పోర్టులోకి వెళ్లే ప్రయత్నం చేశాయి. కార్మికులతో పాటు పోర్టు నిర్వాసితులు కూడ ఆందోళనలో పాల్గొన్నారు.

పక్కనే ఉన్న ప్రభుత్వ పోర్టులో పనిచేస్తున్న కార్మికులకు రూ. 36 వేల వేతనం ఇస్తున్నారన్నారు. కానీ అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న కార్మికులకు కేవలం రూ. 15 వేలను మాత్రమే చెల్లిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: విశాఖలో పవన్ కళ్యాణ్ ‘జనవాణి’ కార్యక్రమం.. వాటిపై చర్చ!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు