Nandyal : నందికొట్కూరులో ఉద్రిక్తత.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..!

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉద్రిక్తత నెలకొంది. ముచ్చుమర్రిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరామర్శించేందుకు వెళ్తుండగా బ్రహ్మణకొట్కూరులో పోలీసులు అడ్డుకున్నారు. ముచ్చుమర్రి వెళ్లడానికి వీల్లేదంటూ అధికారులు నిలవరించారు.

New Update
Nandyal : నందికొట్కూరులో ఉద్రిక్తత.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..!

Nandikotkur : నంద్యాల జిల్లా (Nandyal District) ముచ్చుమర్రిలో మైనర్ బాలిక (Minor Girl) దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి.. ఆ తరువాత మృతదేహాన్ని మల్యాల లిప్ట్‌ కెనాల్‌లో పడేశారు. స్ధానికంగా ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజకీయ నేతలు సైతం ముచ్చుమర్రి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ (TDP) నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

Also Read: మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

అయితే, తాజాగా బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తోన్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddartha Reddy) ని బ్రహ్మణకొట్కూరులో పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని స్టేషన్ కు పిలిపిస్తామని, ముచ్చుమర్రి వెళ్లడానికి వీల్లేదని అధికారులు నిలవరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఆందోళన పరిస్థతి కనిపిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు