TS-AP Border: ఆలయ భూముల్లో వివాదం.. తెలంగాణ, ఏపీ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం ఆలయ భూముల్లో గోశాల నిర్మాణ పనులు చేపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుషోత్తపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు. దేవాలయం భూములు తమవేనంటూ ఆందోళన చేశారు. దీంతో భద్రాచలం ఆలయ సిబ్బంది, గ్రామస్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గోశాల నిర్మాణ పనులకు సహకరించాలని.. ఏపీ రెవెన్యూ అధికారుల్ని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి కోరుతున్నప్పటికీ.. ఇందుకు ఏపీ రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు. By B Aravind 22 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం ఆలయ భూముల్లో గోశాల నిర్మాణ పనులు చేపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుషోత్తపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు. దేవాలయం భూములు తమవేనంటూ ఆందోళన చేశారు. దీంతో భద్రాచలం ఆలయ సిబ్బంది, గ్రామస్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తోపులాట చోటుచేసుకుంది. ఆలయ ఈవో రమాదేవితో కూడా గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గోశాల నిర్మాణ పనులకు సహకరించాలని.. ఏపీ రెవెన్యూ అధికారుల్ని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి కోరుతున్నప్పటికీ.. ఇందుకు ఏపీ రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు. భద్రాచలం ఆలయ సిబ్బంది ఆందోళనకు దిగడంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పురుషోత్తపట్నంలో రాములోరికి 900 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపారు. అందులో.. భద్రాచలానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం గ్రామం కూడా ఆంధ్రాలో కలిసింది. ఈ ఒక్క ఊళ్లోనే రాముల వారికి 900 ఎకరాల భూములున్నాయి. ఇందుకు సంబంధించిన.. హక్కు పత్రాలు కూడా అధికారుల దగ్గరున్నాయి. అయితే.. విభజన సమయంలో రాములోరి భూమి ఏపీ భూభాగంలోకి వెళ్లిపోవడంతో.. తెలంగాణ అధికారులు పట్టించుకోలేదు. భద్రాచలం రామాలయం.. తెలంగాణలో ఉండటంతో.. ఏపీ అధికారులు, పోలీసులు ఈ భూమి వైపు కన్నెత్తి చూడలేదు. రెండు రాష్ట్రాల అధికారులు పట్టించుకోకపోవడంతో.. రాములోరి భూములపై అక్రమార్కులు కన్నేశారు. పదుల ఎకరాలు ఆక్రమించుకున్నారు. స్థానికులు పంచేసుకున్నారా..? భద్రాచలం ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తెలుసుకున్న శ్రీరామ్‌నగర్, కొల్లుగూడెం గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాలేదు. పైగా.. ఆ భూముల్లో కొంత మేర.. తాము కూడా ఆక్రమించేద్దామనుకున్నారు. తమను అడిగేవాళ్లు ఎవరున్నారని.. వాళ్లు కూడా కొంత భూమిని ఆక్రమించేశారు. రామాయణం థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి కేటాయించిన 50 ఎకరాల ఖాళీ ప్రదేశంలో.. నీకింత భూమి.. నాకింత భూమి అంటూ.. వాళ్లలో వాళ్లే పంచేసుకున్నారు. అక్కడితో ఆగకుండా.. హద్దులు కూడా పాతుకున్నారు. హద్దులు కూడా పాతేశాక.. ఇక తమను అడ్డుకునేదెవరు అనుకున్నారో ఏమో కొందరు ఆక్రమణదారులు.. రాములోరి భూమిలో గుడిసెలు కూడా వేసేశారు. ఇంత జరుగుతున్నా.. ఇటు తెలంగాణ అధికారులకు గానీ.. అటు ఆంధ్రా అధికారులకు గానీ.. అక్కడేం జరుగుతుందో కూడా తెలియదు. ఈ వార్త బయటకొచ్చాకే.. వాళ్లకూ అసలు విషయం తెలిసింది. రాములోరి భూముల ఆక్రమణపై.. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. భద్రాచలం ఆలయ ఈవో స్పందించారు. భూములు అన్యాక్రాంతం అవడంపై.. పోలీసులతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌కు కంప్లైంట్ చేశారు. దీంతో.. ఆక్రమణదారులతో పోలీసులు చర్చలు జరిపారు. ఆలయ భూముల్లో నిర్మాణాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2018 తర్వాత ఏమైందో..? పురుషోత్తపట్నమే కాదు.. గుంటూరు, విజయవాడతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ.. భద్రాచలం రాములోరికి భూములున్నాయి. మెదక్ జిల్లా దంతాలపల్లిలో ఉన్న 232 ఎకరాలపై.. కోర్టు వివాదం నడుస్తోంది. పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో.. 109 ఎకరాలు గోశాలకు కేటాయించారు. మిగిలిన 659 ఎకరాల భూమిని.. ఎకరాకు 4 వేల చొప్పున రైతులకు కౌలుకిచ్చారు. 2018 వరకు రైతులు కౌలు చెల్లించారు. ఆ తర్వాత ఏమైందో.. అధికారులకే తెలియాలి. #telangana-news #andhra-pradesh-news #bhadrachalam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి