Geetanjali : జగనన్న(YS Jagan) నాకు ఇల్లు ఇచ్చాడు. నాకల నెరవేరింది. నేనిప్పుడు సంతోషంగా ఉన్నానంటూ... మాట్లాడిన గీతాంజలి(Geetanjali) అనే మహిళా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. నాకు ఇల్లు వస్తుందనుకోలేదు. వేదికపై జగనన్న చేతులమీదుగా తీసుకుంటానని అస్సలు ఊహించలేదని చెబుతూ సంబురపడింది. ఈసంతోషంలో ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడింది. ఆమె మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారాయి. ఆమె ఇప్పుడు చనిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. గీతాంజలి రైలు(Train) కిందపడి సూసైడ్(Suicide) చేసుకుందని సమాచారం.
ఏపీలోని తెనాలి(Tenali) కి చెందిన గీతాంజలి వయస్సు 29ఏండ్లు. ఈమెకు బాలచంద్ర అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సొంతిల్లు లేని వీరికి ఈమధ్య సర్కార్ ఇళ్లు పట్టా అందింది. తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి పట్టా అందజేశారు. ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరుతోందని సంతోషపడింది. ఓ మీడియా ఛానెల్ ఎదుట తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఇప్పుడు చనిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. గీతాంజలి రైలు కిందపడి సూసైడ్ చేసుకుందని సమాచారం.
గీతాంజలిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిందని..దానిని భరించలేకనే ఆమె సూసైడ్ చేసుకుందని కొందరు పోస్టులు పెడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటున్నారు. ఎలా చనిపోయిందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ ఆ మహిళ ఆనందరం అంతలోనే విషాదంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం? ముస్లిం సమాజం సహా అనేక సంస్థలు సీఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?