Social Media Trolling : జగనన్న ఇల్లు ఇచ్చాడని చెప్పడమే ఆమె చేసిన తప్పా..ట్రోలింగ్ కు బలైన యువతి? జగనన్న ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన ఆ మహిళ చనిపోయిందా? ఇంటి స్థలం వచ్చిన ఆనందంలో నవ్వుతూ మాట్లాడిన ఆమె సూసైడ్ చేసుకుందా. అసలు ఏం జరిగింది. ఎవరీ గీతాంజలి..ఏంటా స్టోరీ?తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 11 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Geetanjali : జగనన్న(YS Jagan) నాకు ఇల్లు ఇచ్చాడు. నాకల నెరవేరింది. నేనిప్పుడు సంతోషంగా ఉన్నానంటూ... మాట్లాడిన గీతాంజలి(Geetanjali) అనే మహిళా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. నాకు ఇల్లు వస్తుందనుకోలేదు. వేదికపై జగనన్న చేతులమీదుగా తీసుకుంటానని అస్సలు ఊహించలేదని చెబుతూ సంబురపడింది. ఈసంతోషంలో ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడింది. ఆమె మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారాయి. ఆమె ఇప్పుడు చనిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. గీతాంజలి రైలు(Train) కిందపడి సూసైడ్(Suicide) చేసుకుందని సమాచారం. జగనన్న ప్రభుత్వం వలన లబ్ధి పొందిన గీతాంజలి అనే మహిళ తన సంతోషాన్ని వ్యక్తపరిస్తే ఓర్వలేకపోయిన @JaiTDP, @JanaSenaPartyలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. -వాసిరెడ్డి పద్మ (వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకురాలు, ఏపీ మహిళా కమీషన్ మాజీ చైర్పర్సన్)#JusticeForGeethanjali pic.twitter.com/gC1LykMhOF — YSR Congress Party (@YSRCParty) March 11, 2024 ఏపీలోని తెనాలి(Tenali) కి చెందిన గీతాంజలి వయస్సు 29ఏండ్లు. ఈమెకు బాలచంద్ర అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సొంతిల్లు లేని వీరికి ఈమధ్య సర్కార్ ఇళ్లు పట్టా అందింది. తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి పట్టా అందజేశారు. ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరుతోందని సంతోషపడింది. ఓ మీడియా ఛానెల్ ఎదుట తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఇప్పుడు చనిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. గీతాంజలి రైలు కిందపడి సూసైడ్ చేసుకుందని సమాచారం. ఏంటి ఈవిడ చనిపోయిందా? జగన్ నాకు మంచిచేసాడు అని చెప్పటం ఈమె చేసిన తప్పా trolls చేసి నిండు ప్రాణాన్ని తీసారు కదరా ఎటు వెళ్తున్నది రా సమాజం పాపం రా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు pic.twitter.com/LuJMMjHIgF — MBYSJTrends ™ (@MBYSJTrends) March 11, 2024 గీతాంజలిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిందని..దానిని భరించలేకనే ఆమె సూసైడ్ చేసుకుందని కొందరు పోస్టులు పెడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటున్నారు. ఎలా చనిపోయిందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ ఆ మహిళ ఆనందరం అంతలోనే విషాదంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Your browser does not support the video tag. ఇది కూడా చదవండి : ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం? ముస్లిం సమాజం సహా అనేక సంస్థలు సీఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? #ap #tenali #train-accident #geetanjali #jagananna-house మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి