AP News: వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరింది.. ప్రజలు భయపడుతున్నారు: తెనాలి శ్రావణ్ కుమార్

వైసీపీ నేతల పిచ్చి పరాకాష్టకు చేరిందని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కుల రాజకీయాలకు పెట్టింది పేరు వైసీపీ పార్టీ అని, రాష్ట్రంలో కూటమిదే విజయం అన్నారు.

New Update
AP News: వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరింది.. ప్రజలు భయపడుతున్నారు: తెనాలి శ్రావణ్ కుమార్

Guntur: వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ పిసి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైజాగ్ నుంచి వైసీపీ అధినేత ప్రమాణస్వీకారం చేయడం అనేది వైసీపీ పిచ్చికి పరాకాష్టకు చేరడమేనన్నారు. పేదల పార్టీ పేదల పక్షపాతి అనే జగన్మోహన్ రెడ్డి రూ. 460 కోట్ల ఖర్చుతో విమానం వేసుకొని లండన్ వెళ్లాడు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సామాన్యులు సైతం భయపడే పరిస్థితి నెలకొందని విమర్శలు చేశారు.

ఇక వైసీపీ ఓటమి భయంతో రాష్ట్రంలో తిరుపతి, మాచర్ల లో తీవ్ర ఘటనలకు పాల్పడిందన్నారు. ఏజెంట్లను సైతం భయబ్రాంతులకు గురిచేసి మాచర్ల పల్నాడుజిల్లాలో హల్చల్ చేశారు. తిరుపతిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులకు పాల్పడిన వైసీపీ నేతలు వారి అలజడులపై పరామర్శకు టీడీపీ నేతలు మాచర్ల వెళితే వారిపై వైసీపీ నేతలు దాడులు చేసారు. పోలీసులు సైతం వైసీపీ తొత్తులుగా మారి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి పారిపోవడం కోసం సహకరించిన మాటా వాస్తవం కాదా? ఎన్నికలే వేదికగా ప్రజలు తిరుగుబాటుకు మొదలెట్టారు. మాచర్లఘటనలో సజ్జల, సీఎస్ జవహర్ రెడ్డి హస్తం ఉంది. ధనుంజయ రెడ్డి, సీఎస్ జవహర్, సజ్జల వీరందరూ కలసి బందువర్గంగా ఉండి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల అరాచకానికి తెరలేపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే సీఎస్ జవహర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలి. జగన్ ఉతుత్తి బటన్లు నొక్కి ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఎన్నికల సమయంలో పధకాలు నిధులు విడుదల చేయాలని చూసారు. రాబోయే ఎన్నికల్లో ఫలితాలలో కూటమీ అభ్యర్ద్యులు గెలుపు ఖాయం. కుల రాజకీయాలకు పెట్టింది పేరు వైసీపీ పార్టీ అంటూ మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు