TS: కేసీఆర్ లాగే మీరూ చేయండి.. కాంగ్రెస్ కు హరీష్ రావు కీలక సూచన! అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలో కేసీర్ ఇచ్చినట్లే ఎకరాకు పదివేలు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. హరీష్ రావు ట్వీట్ వైరల్ అవుతోంది. By srinivas 19 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Harish Rao: తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిసి భారీగా పంట నష్టం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు రాజకీయాలు తప్ప రైతుల సమస్యలతో పనిలేదంటూ ట్విటర్ వేదికగా పోస్ట్ షేర్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు… pic.twitter.com/KQAMv1kKz5 — Harish Rao Thanneeru (@BRSHarish) March 19, 2024 ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం.. ఈ మేరకు ‘ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ గారు స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారు.' అని గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: ED: ఆరోపణలే తప్ప ఒక్క రూపాయి పట్టుకోలేదు.. EDకి పిచ్చి పట్టిందంటున్న ఆప్! అలాగే 'రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్.. ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలి. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు, ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని ఆయన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. #congress #farmers #harish-rao #ten-thousend-compensation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి