/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-1-jpg.webp)
Additional Coaches - Sankranti 2024: మరో రెండు మూడు రోజుల్లో సంక్రాంతి పండగ రావడంతో పట్టణ, నగర వాసులు తమ సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ మరికొన్ని ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసింది. అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే మరో కీలక ప్రకటన చేసింది. పద్మావతి, శాతావాహన ఎక్స్‌ప్రెస్‌లతో సహా 16 రైళ్లను అదనపు కోచ్‌లతో తరలిస్తామని పేర్కొంది.
Also read: ఏపీకి మరో 4 స్పెషల్ ట్రైన్లు.. నరసాపూర్, శ్రీకాకుళంతో పాటు..
సికింద్రాబద్ - తిరుపతి, సికింద్రాబాద్ - త్రివేండ్రం, గుంటూరు- రాయగడ, గుంటూరు- తిరుపతి, బీదర్- మచిలీపట్నం, విజయవాడ- విశాఖపట్నం, విజయవాడ- సికింద్రాబద్ రూట్లలో 16 రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసి నడిపించనున్నారు.
Temporary augmentation of trains with additional coaches during Sankranthi festival season @RailMinIndia @drmsecunderabad @drmgtl @drmgnt @drmvijayawada pic.twitter.com/9VtKiDWgMP
— South Central Railway (@SCRailwayIndia) January 11, 2024