Hyderabad: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొతర లేకుండా చూడాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొరత లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆయన అన్నారు. By Vijaya Nimma 09 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి మాట ఇచ్చి మోసం చేశారు... వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడే ఎరువులను వందకు వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తామని 2017 ఏప్రిల్ 13న ప్రగతి భవన్ సాక్షిగా మీరు రైతులకు ఇచ్చిన మాట ఇచ్చారని రేవంత్‌రెడ్డి లేఖలో వివరించారు. అన్ని హామీలు మాదిరిగానే ఈ మాటకు దిక్కు లేకుండా పోయిందని.. ఆరు నూరు అవుతుందేమో కానీ మీరు మాట మీద నిలబడరని మరో సారి నిరూపితమైందన్నారు. ఉచిత ఎరువులని రైతుల చెవిలో మీరు పెట్టిన గులాబీ పూలు అలాగే ఉన్నాయి. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఉచిత ఎరువులు సంగతేమో కానీ, పైసలిచ్చి కొందామనుకున్న ఎరువులు దొరక్క అల్లాడే పరిస్థితి రైతులదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కో-ఆపరేటివ్ సొసైటీలు, వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుల వద్ద ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. యూరియ కొరతతో రైతులకు ఇబ్బంది సీఎం సొంత జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలోని రైతులు యూరియ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల పాటు తిరిగినా దొరకడం లేదని వాపోతున్నారు. సరైన సమయంలో పంటలకు యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నా పట్టించుకునే స్థితిలో మంత్రులు, ఎమ్మెల్యేలు లేరు. బాధ్యత వహించాల్సిన వ్యవసాయ మంత్రి పత్తా లేకుండా పోయిండు. ఇంత జరుగుతున్న స్పందించే తీరిక రైతు బాంధవుడని చెప్పుకునే మీకు లేదు. ఎంత సేపు ఓట్లు, సీట్లు తప్ప రైతుల గోస పట్టదు. ప్రస్తుత డిమాండ్‌కు అనుగుణంగా కనీసం 2 లక్షల టన్నుల అవసరం ఉండగా.. ఇప్పుడు లక్షా 10 టన్నులే బఫర్ స్టాక్ మాత్రమే ఉందన్నారు. ఉద్యమ కార్యాచరణకు దిగుతాం ఎరువులు దొరక్క ప్రతి సీజన్లో రైతులు కష్టాలే పడుతున్నారు. ప్రతిసారి పుష్కలంగా ఎరువులు ఉన్నాయంటూ ముందుగానే ప్రకటించుకుంటున్న వ్యవసాయ శాఖ తీరా సమయంలో చేతులెత్తేస్తోంది. ఎరువులు దొరక్కపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 2019లో మీ సొంత జిల్లా మెదక్.. దుబ్బాకలో యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడిన రైతు ఎల్లయ్య గుండె... క్యూలైన్లో ఆగిపోయింది. అయిన ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. సీజన్లో డిమాండ్ కు అనుగుణంగా యూరియా నిల్వలు చేయాలనే సోయి, ముందు చూపు లేకుండా మీ గుడ్డి ప్రభుత్వానికి. గట్టిగా ప్రశ్నిస్తే అన్నింటికీ రైతుబంధు ఒక్కటే పరిష్కారం అంటూ మురిపిస్తోంది. మీ ప్రభుత్వ ప్రణాళిక లోపం, విధానరాహిత్యం కారణంగా తెలంగాణలో వ్యవసాయ రంగం దయనీయంగా తయారైంది. తక్షణమే అధికారులను అదేశించి యూరియా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు దిగుతుందని హెచ్చరిస్తున్నా మని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. #cm-kcr #letter #tpcc-president-revanth-reddy #urea-deficiency మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి