AP-TG: కమిటీలతో సమస్యలు పరిష్కరిస్తాం.. భట్టి విక్రమార్క! తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ భేటీలో విభజన హామీలతోపాటు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులతో కమీటీలు వేయనున్నట్లు తెలిపారు. By srinivas 06 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ భేటీలో విభజన హామీలతోపాటు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పదేళ్లుగా చాలా అంశాలు పరిష్కరానికి నోచుకోలేదని, వాటిని పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి అధికారులతో కమీటీలు వేయాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. ఇక డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేకు దాదాపు రెండు గంటలపాటు సాగిన భేటీలో పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులు, షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ప్రధానంగా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చ జరిగింది. అలాగే విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించిన అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు, హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశంతోపాటు లేబర్ సెస్ పంపకాలు ఉద్యోగుల విభజన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అలాగే ఏపీలో కలిసిన 7 మండలాల్లో 5 గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని సీఎ రేవంత్.. చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగుడెం, పిచ్చకలపాడు పంచాయితీలు కావాలని కోరారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న కొన్ని భవనాలను తమకే కేటాయించాలని ఏపీ ప్రభుత్వం అడగ్గా.. దీనికి రేవంత్ సర్కార్ తిరస్కరించినట్లు సమాచారం. షెడ్యూల్ 9, 10లో ఉన్న అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు అనగాని సత్యప్రసాద్, బి.సి.జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. #ap-tg #prajabhavan #ap-cm-chandrababu #cm-revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి