Chikoti Praveen Reaction: తెలంగాణ బీజేపీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొన్న కృష్ణ యాదవ్, నిన్న క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen).. మందీ మార్బలంతో ఊరేగింపుగా వస్తే నో ఎంట్రీ అంటూ ఘోరంగా అవమానించారు. అయితే ఈ వ్యవహారంపై కమలంలో పెద్ద రచ్చ జరుగుతోంది. పార్టీలో చేర్చుకోనప్పుడు పిలవడం ఎందుకు..? అవమానించడం ఎందుకని మండిపడుతున్నారు.
అయితే, కేవలం బండి సంజయ్ (Bandi Sanjay) వర్గమనే చీకోటిని పార్టీలో చేర్చుకోలేదని కొందరు కామెంట్స్ చేస్తుండగా..మరోవైపు చీకోటిపై ఉన్న కేసులే పార్టీలో చేరికకు అడ్డంకిగా మారాయని చర్చించుకుంటున్నారు.
నేనంటే ఎంటో చూపిస్తా:
ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీస్‌కు పిలిచి అవమానించడంపై చికోటి ప్రవీణ్ ఘాటుగా స్పందించారు. నన్ను అడ్డుకున్న వాళ్లకి నేనంటే ఎంటో చూపిస్తా అంటూ ధీమ వ్యక్తం చేశారు. అభిమానులు ఎవరు నిరాశ నిస్పృహలకు గురి కావద్దంటూ చికోటి ప్రవీణ్ చెప్పారు.క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ బీజేపీలో (BJP) చేరిక వాయిదా పడింది. చీకోటి కమలం గూటికి చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న ఆయన తన అనుచరులతో కలిసి సంతోష్ నగర్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే చీకోటి రాకముందే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కిషన్ రెడ్డి రాకకోసం చాలాసేపు వేచి చూశారు. కిషన్ రెడ్డి ఎంతసేపటికీ రాకపోవడంతో చికోటి అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరాశతో బీజేపీ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.
పార్టీకి డ్యామేజ్ వస్తుందనే అడ్డుకున్నారా..?
ప్రస్తుత పరిస్థితుల్లో కేసులను ఎదుర్కొంటోన్న చీకోటి ప్రవీణ్‌ను పార్టీలోకి తీసుకుంటే.. చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశం బీజేపీ నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే టైంలో బండి సంజయ్ చీకోటి ప్రవీణ్ చేరికకు పచ్చజెండా ఊపారు. బీజేపీలో చీకోటి ప్రవీణ్ చేరిక లాంఛనమేనని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. క్యాసినో ఆర్గనైజర్‌గా గుర్తింపు పొందిన చీకోటి ప్రవీణ్.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను సైతం ఎదుర్కొన్నారు. చికోటి ప్రవీణ్ అంటే ఏపీ, తెలంగాణలో తెలియని వాళ్లు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడుగా చికోటి ప్రవీణ్ ఉన్న విషయం తెలిసిందే. రాజకీయ ఆరంగేట్రం దాదాపు ఖరారైయిందని అనుకునే టైంలో కమలం హ్యాడ్ ఇచ్చింది. అయితే, చీకోటిని పార్టీలోకి రాకుండా అడ్డుకుంటుందెవరు? చీకోటిపై ఉన్న కేసులే పార్టీలో చేరికకు అడ్డంకిగా మారాయా? ఇంతకు బీజేపీలోకి ఆయనను అనుమతిస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
Also Read: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా