Tirupati: చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పు ఏం కాదు: పెద్దిరెడ్డి ఏపీలో చంద్రబాబు నాయకుడు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఓ వైపు టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు అధికార పార్టీ నేతలు వరస పెట్టి స్పందిస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసంపై మీడియా సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి. By Vijaya Nimma 09 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Peddireddy Ramachandra: ఏపీలో చంద్రబాబు నాయకుడు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఓ వైపు టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు అధికార పార్టీ నేతలు వరుస పెట్టి స్పందిస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసంపై మీడియా సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంతేకాదు చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పు ఏం కాదు. అన్ని విషయాలు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. అవకతవకలు జరిగాయి.. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్‌లో జరిగిన అవకతవకలలో చంద్రబాబు అరెస్టు చేశారు. చంద్రబాబును అరెస్టు చేయడం కరెక్ట్ కాదని ఎల్లో మీడియా అనడం సమంజసం కాదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్‌లో కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని నిర్దారించారు. అందుకే చంద్రబాబుని అరెస్ట్ చేశారని అన్నారు. దీనిపై ఇంతక ముందే కొందరిని అరెస్టు చేసిందన్నారు. సిమెన్స్ కంపెనీలో నిధులు విడుదలే కాలేదని.. క్యాబినెట్‌లో ఒక కంపెనీతో ఒప్పందం.. ప్రాజెక్టు పనులు వేరే కంపినేతో చేసారని నిర్ధారించారు. Also read: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఏంటి? ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటి? ప్రభుత్వ ధనాని దోచేయడానికి ఈ కార్యక్రమం చేశారని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. వీటన్నింటి పైనే సీఐడీ అరెస్టు చేసిందన్నారు. పురందరేశ్వరి, దత్తపుత్రుడు, సీపీఐ వారు ఎవరు నోరు మెదపడం లేదని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. రామారావును వెన్నుపోటు పొడిచినపుడు కూడా మీడియా చంద్రబాబుకి అండగా ఉనుంది.. ఇప్పుడూ అలానే వ్యవహరిస్తోందని అన్నారు.రికార్డుల పరంగా చంద్రబాబు దొరికారు. అయినా చంద్రబాబు నాపేరు ఎక్కడా లేదు అంటూ బుకాయిస్తున్నారని అన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్‌లో అవకతవకలు జరిగాయి. అవి అన్నీ కూడా బయటకు వస్తాయని ఆయన అన్నారు. తప్పు ఎక్కడ జరిగినా ఎవరినీ వదిలి పెట్టరని గతంలో నారాయణ అన్నారు. కమ్యూనిస్టు...ఇప్పుడు నారాయణ చంద్రబాబు ఇస్టుగా మారిపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. also read: ప్రశ్నార్థకంగా నిధుల విడుదల.. సీఐడీ విచారణలో వెలుగుచూసిన విషయాలు! #tirupati #chandrababu-arrest #peddireddy-ramachandra #skill-development-scam-case #minister-peddireddy-ramachandra #chandrababu-leader-arrested మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి