Chandrababu Case Update : నేటితో ముగుస్తున్న చంద్రబాబు రిమాండ్..నెక్ట్స్ ఏం జరగబోతోంది..!!
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు రిమాండ్ నేటితో ముగుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కాగా ఇప్పటికే ఒకసారి చంద్రబాబుకు రిమాండ్ ఎసిబి కోర్టు పొడిగించింది. గత నెల 24 న వర్చువల్ గా ఎసిబి కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు జైలు అధికారులు. నేటితో రిమాండ్ గడువు ముగుస్తు ఉండటంతో.. మరోసారి ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా చంద్రబాబును హాజరు పరుచనున్నారు. ప్రస్తుతం బెయిలు పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్ ను నేడు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.