Guntur: చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోంది: నాదెండ్ల మనోహర్

చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోంది నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్‌ ఆదేశాలతో రేపు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అంతేకాకుదు జనసెన నైతిక బాధ్యతతో టీడీపీ అండగా నిలబడుతామని జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

AP: ఇలా ఉండటం బాధాకరం.. ఇకపై ఈ పరిస్థితి ఉండదు:  మంత్రి నాదెండ్ల
New Update

ప్రపంచ దేశాల్లో ఆయనకు పేరు

చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఆయన అరెస్ట్‌ జనసేన తీవ్రంగా ఖండిస్తున్నామని కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగటం చాలా దురదృష్టకరం మన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్ట్ తీరు బాధాకరం అన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలమేరకు అధికారులు రాజకీయ కక్షతో అరెస్ట్ చేసిన తీరుని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ప్రపంచ దేశాల్లో ఆయనకున్న పేరును చూసి తెలుగు వాడిగా నేను గర్వపడతాను అని అన్నారు.

also aead: చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు విజయవాడకు పవన్ కల్యాణ్

ఇప్పుడు అరెస్ట్ చెయ్యటం ఏమిటి..?

మన అందరికీ గర్వకారణం అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అయన అన్నారు. వ్యక్తిగత కక్ష సాధింపుతో గత మూడు నాలుగు నెలల నుంచి ఏదో రకంగా రెచ్చగొట్టి కేసులు పెట్టాలని చేస్తున్న వాటిని పార్టీలకు అతీతంగా ముక్తంఠంతో ఖండించాలి అని జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గతంలో వైజాగ్‌లో జనవాణి కార్యక్రమం సందర్భంలో జనసేన నేతలను మూడు రోజు నిర్బంధించిన ఘటన చూసామని మనోహర్‌ గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి నెగిటివ్ ఆలోచనలు.. నెగిటివ్ పనులతో రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తరువాత ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. కానీ కనీసం రాష్ట్ర నష్టపోయిన బాధ లేని వ్యక్తి జగన్ మాత్రమే అని అన్నారు. చంద్రబాబు నాయుడు మీద గత 3 ఏళ్ల క్రితం కేసు రిజిష్టర్ చేశామని ఇప్పుడు అరెస్ట్ చెయ్యటం ఏమిటి..? అని ప్రశ్నించారు.

లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతాం: సీఐడీ చీఫ్‌

also aead: లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతాం: సీఐడీ చీఫ్‌

టీడీపీ అండగా  ఉంటాం

ప్రతిపక్షాలు ఎక్కడ సభలు సమావేశాలు పెట్టినా.. కావాలని ఇబ్బందులు సృష్టించటం.. స్థానిక నాయకులపై దాడులు చెయ్యటం అధికార పక్షానికి అలవాటుగా మారిందన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరిలో రేపు నాయకులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని రాజకీయ సంక్షోభం గురించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జగన్ ప్రభుత్వం పొరపాటు చేస్తున్నారు. చంద్రబాబు మీద కేసులు బనాయించటం దారుణం అన్నారు. జనసెన నైతిక బాధ్యతతో టీడీపీ అండగా నిలబడుతుందని జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

#nadendla-manohar #chandrababu-arrest #janasena #condemns #guntur
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe