AYODHYA RAMA MANDIR : శ్రీ రాముడు పాత్రలో అలరించిన తెలుగు హీరోలు

మన తెలుగు సినిమా హీరోలు శ్రీ రాముని పాత్రలో మెప్పించి జన నీరాజనాలందుకుని ఆ శ్రీరాముని పట్ల తమ భక్తిని దశదిశలా చాటుకున్నారు. అయోధ్యరామ మందిర ప్రారంభోత్సవ సంధర్భంగా వెండితెరపై శ్రీరాముని పాత్రలో మెప్పించిన స్టార్ హిరోలపై ప్రత్యెక కథనం.

AYODHYA RAMA MANDIR : శ్రీ రాముడు పాత్రలో అలరించిన తెలుగు హీరోలు
New Update

Jai Sri Ram : రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకల ప్రాణి కోటికి హితవుకలిగించే సాధుజీవనుడు. అతని పరాక్రమమునకు తిరుగులేదు ఎన్ని తరాలయినా రామ నామం జనజీవనానికి తారక మంత్రం. అయోధ్య(Ayodhya) రామ మందిర(Ram Mandir) ప్రారంభోత్సవ వేళ ఇప్పుడు యావత్ భారతదేశం(India) రామనామ మంత్రంతో మారుమ్రోగిపోతోంది. ఊరూ, వాడా జై శ్రీ రామ్(Jai Sri Ram) అంటూ తమ భక్తి మీ నలు దిక్కులా  చాటుతున్నారు. అయోధ్య రామ మందిరానికి విరాళాలు సైతం భారీగా ఇస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో టాలివుడ్ నుంచి డార్లింగ్ ప్రభాస్ అయోధ్యారామ మందిరానికి విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ కోసం 50 కోట్ల రూపాయలు  విరాళంగా కూడా ఇచ్చి ఆ అయోధ్య రాముని పట్ల తన భక్తిని చాటుకున్నాడు. ఇక.. మన తెలుగు సినిమా హీరోలు శ్రీ రాముని పాత్రలో మెప్పించి జన నీరాజనాలందుకుని ఆ శ్రీరాముని పట్ల తమ భక్తిని దశదిశలా చాటుకున్నారు. అయోధ్యరామ మందిర ప్రారంభోత్సవ సంధర్భంగా వెండితెరపై శ్రీరాముని పాత్రలో మెప్పించిన స్టార్ హిరోలపై ప్రత్యెక కథనం.

రామకథతో వచ్చిన మొట్ట మొదటి సినిమా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’

సినిమా(Cinema) అంటే భావోద్వేగాల సమ్మేళనం. ఇవన్నీ రామాయణ కావ్యంలో పుష్కలంగా ఉంటాయి. అందుకనే ఇప్పటికీ హాలివుడ్ ఫిలిం మేకర్స్ మన రామాయణాన్ని ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తూనే ఉన్నారు.అలనాటి లవకుశ నుంచి మొన్న వచ్చిన ఆదిపురుష్ వరకు తెలుగు సినిమాపై రాముని ఔచిత్యాన్ని మనోహరంగా ఆవిస్కరించి రామాయణ మాహా కావ్య విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారు. అసలు తెలుగు సినిమానే పౌరాణిక కథలతో ఆరంభం అయింది. ఈ క్రమంలో రామకథతో వచ్చిన మొట్ట మొదటి సినిమా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో విడుదలైన ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ తొలిసారి రాముని పాత్రలో కనిపించారు.అయితే ఎంతో మంది రాముని పాత్రను పోషించినా సరే .. విశ్వ విఖ్యాత నట సార్వబౌముడు నందమూరి తారక రామారావు శ్రీరాముడి పాత్రలో మెప్పించిన విధానం నభూతో నభవిశ్యతి. శ్రీ రాముడంటే ఎన్టీఆర్ అనేటంతలా వెండితెరపై చెరగని ముద్ర వేసారు.

శ్రీరాముడి పాత్రలో ఎన్టీఆర్ తనదైన ముద్ర 

శ్రీరామచంద్రుడిలో ఉన్న ఔచిత్యాన్ని , రాముడి లో ఉన్న స్వచ్చతను ,సచ్చీలతను , శాంతి గుణాన్ని నూటికి నూరు శాతం పండించి శ్రీ రాముడి పాత్రకు వన్నె తెచ్చారు.‘సంపూర్ణ రామాయణం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రామాంజనేయం యుద్ధం’ లవకుశ వంటి పలు సినిమాల్లో రాముడి పాత్రలో మెప్పించారు ఎన్టీఆర్. ఇప్పటికీ ప్రతీ ఇంట్లో ఎన్టీఆర్ శ్రీ రాముడి ఆహార్యంలో ఉన్న ఫోటో ఉంటుందంటే ప్రజలపై ఎంతటి ముద్ర వేసారో అర్ధమవుతోంది. ఇక..   ఎన్టీఆర్ తర్వాత రాముడుగా నటించి మెప్పించిన నటుడు హరినాథ్. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామకళ్యాణం’  సినిమాతో పాటు  ‘శ్రీరామకథ’ అనే చిత్ర లో హరనాథ్ కోదండ రాముడిగా మెప్పించాడు. ఇక.. అలనాటి నటుడు కాంతారావు సైతం వీరాంజనేయ సినిమాలో రాముడిగా నటించి మెప్పించారు.

అక్కినేని తొలి సినిమా సీతారామ జననం

ఇక.. అక్కినేని నాగేశ్వర రావు ఆయన త్తన నట ప్రస్తానం ఆరంభించింది సీతారామ జననం’ సినిమాలో రాముడి పాత్రతోనే కావడం విశేషం. తెలుగు ప్రేక్షకులు ఎన్టీఆర్ , అక్కినేని తరువాత అంతలా ఆదరించింది మాత్రం శోభన్ బాబు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సంపూర్ణ రామాయణంలో శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత శోభన్ బాబుకే చెల్లింది.ఆ తరువాత సీతా కళ్యాణం సినిమాలో సైతం శ్రీ రాముడుగా నటించి మెప్పించారు శోభన్ బాబు. శ్రీరామ భక్తుని కథతో తెరకెక్కిన శ్రీరామదాసు చిత్రంలో శ్రీరాముడిగా నటించిన సుమన్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్ సైతం శ్రీరాముడిగా మెప్పించి రామునిపై తన భక్తిని చాటుకున్నాడు.

శ్రీరాముడిగా బాలయ్యబాబు

నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీ రామరాజ్యం సినిమాలో శ్రీరాముడిగా బాలయ్యబాబు, నయనతార గా ప్రేక్షకులను మెప్పించారు. శ్రీ రామ చరిత్రను వెండితెరపై అద్భుతంగా అవిష్కరించడంలో దిట్ట అయిన బాపు దర్సకత్వంలో వచ్చిన సినిమాలు రామాయణ మాహా కావ్య గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలల చాటాయి.శ్రీరాముని కథతో చాలా చిత్రాలను వెండితెరపై దృశ్యరూపాన్ని ఇచ్చిన ఘనత దర్శకుడు బాపుదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

బాల రామాయణం సినిమాతో శ్రీ రాముడి పాత్రతో సిని రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్

ఇక..ఎన్టీఆర్ పేరుని సార్ధకం చేస్తూ తొలి సినిమాతోనే బాలనటుడిగా  బాలరామాయణం సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో బాలనటుడిగా శ్రీరాముని పాత్రలో అలరించి అందరి ప్రసంసలు అందుకున్నాడు.

ప్రభాస్  ఆదిపురుష్ వివాదాల సినిమా 

ఈ మధ్యనే విడుదలయి అనేక వివాదాలకు కేంద్రబిందువైన ఆది పురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఆహార్యం ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంది. దర్శకుడు ఓంరౌత్ పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఏదేమయినా శ్రీ రాముని ఔచిత్యాన్ని ప్రజలకు చేరువచేయాలనే ఆయా నటులు , దర్శకుల ప్రయత్నం తెలుగు సినిమా ఉన్నంత కాలం చిరస్తాయిగా నిలిచే ఉంటుంది. ఈ నెల22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా అందరికి  శ్రీరాముడి దీవెనలు ఉండాలి.  శ్రీరాముని జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శం కావాలి. జై . శ్రీరాం.

ALSO READ: ఏడాదిలో ఒక రోజు రాముని తిలకంగా సూర్యుడు..అయోధ్య రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు!

#tollywood-star-hero #ayodhya-ram-mandir #ayodhya
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe