National Film Awards: తెలుగు చిత్రాలకు అవార్డుల పంట.. RRRకు 6, పుష్పకు 2..

ఆస్కార్ అవార్డు దక్కించుకున్న త్రిబుల్ ఆర్ చిత్రం..జాతీయ అవార్డుల్లోనూ తన సత్తా చాటుకుంది. ఈ చిత్రానికి ఆరు అవార్డులు లభించాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా త్రిబుల్ఆర్ ఎంపికైంది. అలాగే ఉత్తమ నేపథ్యగాయకునిగా కాలభైరవ, ఉత్తమ సంగీత దర్శకునిగా ఎంఎంకీరవాణి, బెస్ట్ కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్టంట్ కోరియోగ్రఫీ కింగ్ సాల్మన్, స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేటర్ వి.శ్రీనివాసమోహన్‌కు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటునిగా అల్లుఅర్జున్, ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడి పురస్కారం పుష్ప మూవీకి గానూ అల్లు అర్జున్‌కు దక్కింది.

author-image
By Amar
New Update
National Film Awards: తెలుగు చిత్రాలకు అవార్డుల పంట..  RRRకు 6, పుష్పకు 2..

ఆస్కార్ అవార్డు దక్కించుకున్న త్రిబుల్ ఆర్ చిత్రం..జాతీయ అవార్డుల్లోనూ తన సత్తా చాటుకుంది. ఈ చిత్రానికి ఆరు అవార్డులు లభించాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా త్రిబుల్ఆర్ ఎంపికైంది. అలాగే ఉత్తమ నేపథ్యగాయకునిగా కాలభైరవ, ఉత్తమ సంగీత దర్శకునిగా ఎంఎంకీరవాణి, బెస్ట్ కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్టంట్ కోరియోగ్రఫీ కింగ్ సాల్మన్, స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేటర్ వి.శ్రీనివాసమోహన్‌కు అవార్డులు దక్కాయి. ఉత్తమ నటునిగా అల్లుఅర్జున్, ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడి పురస్కారం పుష్ప మూవీకి గానూ అల్లు అర్జున్‌కు దక్కింది. అలాగే ఈ చిత్రానికి నేపథ్యగాయకునిగా దేవిశ్రీప్రసాద్ , కొండపొలం సినిమాలో గీతానికి గాను చంద్రబోస్‌కు లభించింది. తెలుగులో ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ అవార్డును పురుషోత్తమాచార్యులు ఎంపికయ్యారు. దాదాపు 28 భాషల్లో 280 ఫీచర్‌ ఫిల్మ్‌లు, 23 భాషల్లో 158 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌లు అవార్డుల కోసం ఎంట్రీలు రాగా.. వీటిలో ఉత్తమ చిత్రాలను కమిటీ ఎంపిక చేసింది.

మరిన్ని వార్తల కోసం చూడండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు