Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వడబోతకు ఏఐ టెక్నాలజీ!
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను కోరింది. వచ్చిన దరఖాస్తుల ను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వడపోత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను కోరింది. వచ్చిన దరఖాస్తుల ను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వడపోత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్‌లోని ఓయూ పీజీ లేడీస్ హాస్టల్ దగ్గర టెన్షన్..టెన్షన్ గా ఉంది. అర్ధరాత్రి గోడదూకి ఇద్దరు ఆగంతకులు హాస్టల్లో దూరడంతో విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ కాలేజీ గేట్లు మూసేసి విద్యార్ధినులు ఆందోళన చేస్తున్నారు.
మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు.
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించారు. కాగా, లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ గత బోర్డు సభ్యులపై విచారణకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేందర్ రావు(94) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. అల్వాల్‌లోని తన నివాసంలో వయోభారంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మశ్చేందర్రావు గతంలో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
పాలకులు నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. 'గడిచిన 10ఏళ్లలో రాష్ట్ర పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించింనందుకే ప్రజలు చరమగీతం పాడారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం' అని అన్నారు.
బీసీ జన గణన చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందన్నారు. ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయని పేర్కొన్నారు. హామీల గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2375 బస్సులను విడతల వారీగా అందుబాటులోకి తేనున్నామని, అలాగే వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌ను చేపడుతామని పేర్కొన్నారు.
BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. తన భూమిని కబ్జా చేశారని..నకిలీ పత్రాలు సృష్టించారని.. ఇదేంటి అని అడిగితే బెదిరించారని రాధిక అనే మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనతో పాటు భార్య నీలిమపై కేసు నమోదు చేశారు.