Padma Awards 2024: పద్మ విభూషణులు వెంకయ్య, చిరంజీవి.. ముగ్గురు తెలుగు వారికి పద్మశ్రీ
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. వారితో సహా మొత్తం ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను ప్రకటించింది.