kottagudem: ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ.. కౌన్సిలర్ ఆస్తులపై దాడులు
ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస సెగ ఇంకా చల్లారలేదు. అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్ వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై రెవన్యూ అధికారుల దాడులు నిర్వహించారు. కొండపల్లి సరితకు చెందిన మామిడితోట, కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర వాగ్వాదం మొదలైంది.