R. Krishnaiah : జగన్‌కు రేవంత్ షాక్... కాంగ్రెస్‌లోకి ఆర్.కృష్ణయ్య!

వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయనను ఎంపీ మల్లు రవి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. కాగా ఆయన ఈరోజు లేదా రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

New Update

R. Krishnaiah: ఏపీ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఊహించాని షాక్ ఇచ్చారు బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. ఇప్పటికే నేతల రాజీనామాలతో తలపట్టుకున్న జగన్ కు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీకి సంఖ్య బలం తగ్గినట్లయింది. అయితే వ్యక్తి గత కారణాల వల్లే తాను వైసీపీ పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిన్న జగన్ కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా LB నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అనంతరం టీడీపీకి దూరంగా ఉన్న ఆయన 2018లో కాంగ్రెస్ నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇదిలా ఉంటే అనూహ్యంగా 2022లో ఏపీలో ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Also Read :  ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

జగన్‌కు రేవంత్ స్కెచ్..? 

బీసీ హక్కుల పోరాటం కోసమే తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన కృష్ణయ్య వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రేవంత్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనను పార్టీలో ఆహ్వానించేందుకు ఎంపీ మల్లు రవిని అతని  నివాసానికి పంపినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ ఆదేశాలతో ఈరోజు ఆయనను ఎంపీ మల్లు రవి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. దీనిపై ఆర్. కృష్ణయ్య సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఈరోజు లేదా రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Also Read :  15 లక్షల రేషన్ కార్డులు రద్దు?

రాజ్యసభలో జగన్ కు తగ్గిన బలం..

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేయడంతో రాజ్యసభలో ఏపీ నుంచి ఒక సీటు ఖాళీ అయింది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉండగా.. ఇటీవల బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో ఆ పార్టీ బలం 9కి పడిపోయింది. ఇప్పుడు ఆర్.కృష్ణయ్య సైతం రాజీనామా చేయడంతో వైసీపీ సభ్యుల సంఖ్య 8కి చేరింది.

Also Read :  నేటి నుంచి గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి

Also Read :  అవయవ దాన కర్ణులెక్కడ..? అతివలే ముందు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు