MP Raghunandan Rao: సాయంత్రంలోగా చంపేస్తాం.. ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపులు

మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావుకు బెదిరింపులు ఆగడం లేదు. గతంలో ఆయనకు పోన్‌ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఈ రోజు మరోసారి రఘునందన్‌రావుకు దుండగులు ఫోన్‌ చేసి బెదిరించారు.

New Update
Raghunandan Rao Madhavaneni

Raghunandan Rao Madhavaneni

MP Raghunandan Rao:

మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావుకు బెదిరింపులు ఆగడం లేదు. గతంలో ఆయనకు పోన్‌ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ప్రభుత్వం భద్రతాను పెంచడంతో పాటు అవసరమైన రక్షణ ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే మరోసారి  రఘునందన్‌రావుకు దుండగులు ఫోన్‌ చేసి బెదిరించారు. హైదరాబాద్‌లోనే ఉన్నామని, సాయంత్రం లోగా చంపేస్తామని హెచ్చరించారు. కాగా రఘునందన్‌ రావుకు ఇలా బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడం ఇది ఆరోసారి. తాజాగా 9404348431 నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చినట్లు పోలీసులకు ఆయన  ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి:  తల్లి ఎఫైర్.. తట్టుకోలేక కొడుకు సూ**సైడ్.. ఆ గ్రామంలో హైటెన్షన్!

గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి చంపేస్తాం అని చెప్పడంతో పాటు ఎవరు కాపాడుతారో చూద్దామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా రఘునందన్ రావుకు .. ఇవాళ కూడా బెదిరింపు కాల్ రావడంతో బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: పెళ్లైన వ్యక్తితో సహజీవనం..కూతుర్ని నరికి చంపిన తండ్రి.. ప్రియుడి పిటిషన్తో..!

గతంలోనూ రఘునందన్‌ రావుకు పోన్‌ చేసిన దుండగులు ఛత్తీస్ గఢ్‌లో ‘ఆపరేషన్ కగార్‌’ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టుల పేరుతో హెచ్చరించారు. గతంలోనూ హైదరాబాద్‌లోనే మా టీమ్ ఉందని మరికాసేపట్లోనే నిన్ను చంపేస్తాం అంటూ పలుమార్లు రెండు వేర్వేరు నంబర్ల నుంచి అగంతకులు కాల్స్ చేసి బెదిరించారు.  అయితే రఘనందన్‌ రావుకు అందులోనూ బీజేపీ పార్టీ నాయకుడికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ రావడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఆయన కోసం కావాలనే అగంతకులు కాల్‌ చేస్తు్న్నారా? లేదంటే నిజంగానే ఆయన కోసం అగంతకులు ఏదైనా ప్లాన్‌చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రఘునందన్‌రావుకు కాల్స్‌ చేసేది తీవ్రవాదులా? ఇంకా ఎవరైనానా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

Advertisment
తాజా కథనాలు