బీజేపీకి రవీంద్ర నాయక్ షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి..
మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదట్లోనే ఇలా మండిపోతుంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయో ఆలోచిస్తేనే ఉక్కపోత ఎక్కువ అయిపోతుంది.తొమ్మిది జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును గెలవడమే లక్ష్యంగా అక్కడ చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే ఈ చేరిక జరిగిందని తెలుస్తోంది.
ఎంపీ టికెట్ రాలేదని నిరాశ పడ్డ మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈరోజు రాజయ్యతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశం అయ్యారు కేసీఆర్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ను గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పజెప్పారు కేసీఆర్.
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి ఝాన్సీరెడ్డిపై మరో సారి సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు. బీఆర్ఎస్ నేతలను చేరికలను అడ్డుకున్నారు. ఝాన్సీరెడ్డి తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
తన ముందు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిి కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓ మహిళ. దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ధైర్యంగా నీటిలోకి మరీ చిన్నారులను రక్షించింది. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణ శివారు ప్రాంతం గౌతమబుద్ధ కాలనీలో జరిగింది.
TS: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్గా సుధీర్ కుమార్ ఉన్నారు. తనకు టికెట్ వస్తుంది అని ఆశగా ఉన్న రాజయ్యకు నిరాశే ఎదురైంది.
వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను బరిలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పిలుపుతో రాజయ్య ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత రాజయ్య పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.