/rtv/media/media_files/2025/04/04/rlkINhmIW4WaPxEPmcgU.jpeg)
Hanumakonda District Court
హనుమకొండ జిల్లాలోని కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి కాల్ చేసి మరీ చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన హనుమకొండ జిల్లా కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబు స్క్వాడ్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు. హనుమకొండ కోర్టులోపల ఉన్నవారిని బయటకు పంపించారు. అనుమానస్ప ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ టీం తనిఖీలు చేస్తోంది. పోలీసు జాగిలాలతోో కోర్టు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫోన్ చేసిన నెంబర్ ఎవరిదని ఎంక్వైరీ చేస్తున్నారు. కోర్టులో నిజంగానే బాంబు ఉందా.. లేక బెందిరించాలని తమాషాకి అతను కాల్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2025
హనుమకొండ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
న్యాయమూర్తికి ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టామని చెప్పిన గుర్తుతెలియని వ్యక్తులు
కోర్టుకు చేరుకుని తనిఖీలు చేస్తున్న బాంబ్ స్క్వాడ్ బృందం pic.twitter.com/y8OOrSProt