Warangal : ప్రియుడితో కలిసి భర్తపై దాడి.. చెవులు కొరికిన భార్య!

మహబూబాబాద్‌ జిల్లా గడ్డిగూడెంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న  భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ క్రమంలో అతడి చేవులు కొరికింది.

New Update

మహబూబాబాద్‌ జిల్లా గడ్డిగూడెంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న  భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ క్రమంలో అతడి చేవులు కొరికింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రష్మిత, ప్రసాద్ కు పెళ్లైంది. వీరికి పిల్లలున్నారు. అయితే రష్మితకు ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన అనిల్‌తో ఎఫైర్ ఏర్పడింది.  ఈ విషయం ప్రసాద్ కు తెలియడంతో రష్మితను మందలించాడు. తీరు మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త అడ్డు తొలిగించుకోవాలని ఫిక్స్ అయిన రష్మిత చివరగా భర్తను చంపేయాలని ఫిక్స్ అయింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. ఈ క్రమంలో అతని చెవులు కొరికింది. భార్య రష్మిత. ప్రియుడు అనిల్‌తో కలిసి భర్త ప్రసాద్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో ప్రాణభయంతో పరుగులు తీశాడు భర్త ప్రసాద్ . అతని అరుపులతో పారిపోయేందుకు ప్రియుడు అనిల్‌ యత్నించాడు. గ్రామస్తులు అనిల్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేసి మరి కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అనిల్,  రష్మితను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు