/rtv/media/media_files/2025/04/12/bXrwnDJ82XlUYDDdvaSl.jpg)
TG WAQF BOARD
Waqf Law : దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంట్ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఆమోదించగా..ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చిందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కేంద్రం పంపిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ఏప్రిల్ 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లును ఆమోదించారు. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
భారతదేశంలో వక్ఫ్ బోర్డులు చాలా పెద్ద సంఖ్యలో ఆస్తులను కలిగి ఉన్నాయని తెలుస్తోంది. సుమారుగా 8.7 లక్షల నుంచి 9.4 లక్షల ఎకరాల భూమిలో విస్తరించి ఉన్నాయని అంచనా. వీటి విలువ సుమారు రూ1.2 లక్షల కోట్లు ఉంటుంది. ఇండియన్ రైల్వే, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డు మూడవ అతిపెద్ద ల్యాండ్ బ్యాంకును కలిగి ఉంది. ఇటీవల వక్ఫ్ చట్టం 1995కు సవరణలు చేస్తూ 2025 నూతన చట్టం ఆమోదించబడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వక్ఫ్ ఆస్తులపై చర్చ మెుదలైంది. తెలంగాణలో వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయన్న ప్రశ్న తలెత్తడం సహజం.
Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
తెలంగాణలో వక్ఫ్ బోర్డుకు మెుత్తం 77,538 ఎకరాల భూమి ఉంది. అయితే ఇందులో చాలావరకు అంటే సుమారు 74శాతం వరకు ఆక్రమణకు గురైంది. 57,423 ఎకరాలు పూర్తిగా లేదా కొంతభాగం కబ్జాకు గురయ్యాయి. వీటిని ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు ఆక్రమించాయి. వీటిలో 33,929 వక్ఫ్ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్ని కేవలం వ్యవసాయ భూములు మాత్రమే. ఇవి కాకుండా షాపింగ్ కాంప్లెక్స్‌లు, భవనాలు వంటి ఇతర ఆస్తులను కూడా ఉన్నాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో 23,910 ఎకరాల భూమి ఉంది. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 534 ఎకరాల భూమి ఉంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు కేంద్రం చర్యలు చేపట్టింది. వక్ఫ్ అధికారులు, రెవెన్యూ శాఖ సహాయంతో IIT-ఢిల్లీ బృందం సర్వే చేపట్టనుంది. ఏప్రిల్ 28న IIT-ఢిల్లీ బృందం హైదరాబాద్ రానుంది. వెంటనే సర్వే పనులు మొదలు పెడుతుంది.తద్వరా వక్ఫ్ బోర్డు ఆస్తులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోతుందా.. ఈ ఒక్క పని చేయండి