Medigadda: మేడిగడ్డపై 738 పేజీల సంచలన నివేదిక

TG: మేడిగడ్డ కుంగిపోవడంపై 738 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చింది. నిర్మాణ లోపాలు, క్వాలిటీ టెస్ట్ చేయకుండానే బిల్లుల చెల్లింపులు, పని పూర్తికాకుండానే ధ్రువీకరణ పత్రాల జారీ వంటివి నివేదికలో పేర్కొంది.

Medigadda Project : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల విషయంలో కమిటీ ఏర్పాటు
New Update

Medigadda: మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడానికి గల పలు కీలక కారణాలపై దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో బ్యారేజి నిర్మాణంలో లోపాలు, ప్రాజెక్ట్ క్వాలిటీ టెస్టు పరీక్షలు చేయకుండానే బిల్లుల చెల్లింపులు చేసినట్లు, ఒప్పందం ప్రకారం పని పూర్తికాకుండానే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాల జారీ చేసినట్లు, నిర్వహణలో లొసుగులు.. ఇలా అనేక వైఫల్యాలను ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పొందుపరిచింది. 

మొత్తం 738 పేజీలు...

కాగా మొత్తం 738 పేజీల ఉన్న నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు విజిలెన్స్ అధికారులు. కాళేశ్వరం మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(రామగుండం) వెంకటేశ్వర్లు, ప్రస్తుత చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌ రెడ్డి, గతంలో ఈఈగా, ఎస్‌ఈగా పనిచేసి ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్‌గా ఉన్న రమణా రెడ్డి, మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తిరుపతిరావు.. ఇలా మొత్తం 14 మంది ఈ ప్రాజెక్ట్ విషయంలో విచారణలో చెప్పిన కీలక అంశాలను నివేదికలో పేర్కొన్నారు.కాగా ఇటీవల ఈ నివేదికను కాళేశ్వరంపై న్యాయవిచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌కు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అందచేయగా.. తాజాగా ప్రభుత్వానికి ఇచ్చింది.  అయితే దీనిపై రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.

డిసెంబరు వరకు..

గత ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు దీనిపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కు విచారణ కోసం మరింత సమయాన్ని కేటాయిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గడువును డిసెంబరు ఆఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహల్‌ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇంజినీర్లతో విచారణ పూర్తి చేసిన జస్టిస్‌ ఘోష్‌ ఈ నెలలో పలువురు ఐఏఎస్‌ అధికారులను విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అయితే ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకంగా పని చేసిన  కొందరు అధికారులు గత ప్రభుత్వం హయాంలో  సీఎంగా ఉన్న  కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఆదేశాల మేరకే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని సంచలన విషయాలను చెప్పారని విజిలెన్స్ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. 

#kcr #medigadda #medigadda vigilance report
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe