తెలంగాణలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీర్ల సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులపై సదరు కంపెనీ వివరణ ఇచ్చుకుంది. బీరు తయారీ ముడిసరకు ధరలు బాగా పెరిగాయి అని చెప్పుకొచ్చింది. బీరు ధరలో తయారీ ధర కేవలం 16 శాతం మాత్రమేనని.. అందులో 70 శాతం ప్రభుత్వ పన్నులే ఉంటాయని వెల్లడించింది. కంపెనీకి ప్రభుత్వం ఇన్ టైమ్ కు డబ్బులు చెల్లించలేదని స్పష్టం చేసింది. నష్టాలతో వ్యాపారం చేయలేకనే బీర్ల సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని తెలిపింది. కాగా బుధవారం యూబీ ప్రతినిధులు ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ను కలిశారు. తెలంగాణకు పూర్తిగా బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. ధరలు పెంచాలని గతంలో ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆ లేఖలో తెలిపారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 45 రోజులకి ఒకసారి బకాయిలు సాధారణంగా బేవరేజెస్ కార్పొరేషన్ (యూబీ) గ్రూప్‌కు ప్రతి 45 రోజులకి ఒకసారి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికి నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు లేఖలో పేర్కొంది. 2019-20 నుంచి బీర్ల ధరలను సవరించకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ తెలిపింది. మద్యంలో చాలా రకాలు ఉన్నప్పటికీ బీర్లకు మాత్రం ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అందులోనూ మళ్లీ కింగ్ ఫిషర్ బీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వయసు పై బడిన వారు విస్కీ, ఐబీ లాంటి మద్యాన్ని సేవిస్తే యూత్ మాత్రం కింగ్ ఫిషర్ బీర్ల కోసం ఎగబడుతారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్‌గా కింగ్ ఫిషరేకు మంచి పేరు వచ్చింది. సంక్రాంతి పండుగకు మరికొద్ది రోజులే సమయం ఉందనగా ఈ బీర్లు లేవనే వార్త యూత్ కు బ్యాడ్ అనే చెప్పాలి. అయితే మద్య ధరల పెంపుపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిటీ వేశామని.. నివేదిక వచ్చాక ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. Also Read : సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి బిగ్ షాక్... ఛార్జీలను పెంచిన ఆర్టీసీ