Crime News: హైదరాబాద్‌లో ఏపీని తలపించిన ఘటన.. గోనె సంచిలో డెడ్ బాడీ!

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. గోనె సంచిలో డెడ్ బాడీ కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లిలో డ్రైనేజీ కాలువలో ఓ సంచిలో డెడ్ బాడీని జీహెచ్ఎంసీ కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
dead body in sack

dead body in sack Photograph: (dead body in sack)

హైదరాబాద్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. గోనె సంచిలో డెడ్ బాడీ కలకలం రేపింది. దీంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన ఇవాళ చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో డ్రైనేజీ కాలువలో ఓ సంచిలో డెడ్ బాడీని జీహెచ్ఎంసీ కార్మికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. 

Also Read: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 

ఈ ఘటనపై పోలసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఎక్కడో చంపి ఒక గోనె సంచిలో మూట కట్టి దుర్గానగర్ వద్ద పడేసినట్లు సమాచారం. దీంతో హత్య చేసింది ఎవరు?.. హత్యకు గురైంది ఎవరు? అనే అంశంపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

Also Read:  శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే

ఏపీలో ఇలాంటి ఘటనే ఒకటి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో తులసి అనే మహళకు ఇటీవల పార్శిల్‌లో మృతదేహం రావడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ కేసును పోలీసులు ముమ్మరం చేయగా.. సస్పెన్స్ థ్రిల్లర్‌లా రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ఇప్పుడిప్పుడే డెడ్‌బాడీ డెలివరీ కేసులో మిస్టరీ వీడుతోంది. 

Also Read: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మగా గుర్తించారు. శ్రీధర్ వర్మ మరెవరో కాదు తులసి మరిది. అతడితో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ డెడ్ బాడీ ఎవరిది అని అందరిలోనూ ఉత్కంఠ ఉండేది. దాన్ని కూడా పోలీసులు కనిపెట్టారు. డెడ్ బాడీ బర్రె పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు.

బర్రె పర్లయ్య రోజువారీ కూలీగా చేపల చెరువు మీద పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే పర్లయ్యను శ్రీధర్ ఎందుకు చంపాడు..?. మృతదేహాన్ని వదిన తులసి ఇంటికి ఎందుకు పార్శిల్ చేశాడు..?. వదిన తులసితో శ్రీధర్ వర్మకు ఆస్తి గొడవలు గొడవలు ఏమైనా ఉన్నాయా?.

నిందితుడు శ్రీధర్ వర్మ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు డెడ్‌బాడీ పార్శిల్ చేసే విషయంలో మరో మహిళ సహకారం తీసుకున్నాడు. ఆ మహిళ ఎవరు?.. ఆమెకు శ్రీధర్ వర్మకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే పలు విషయాలు పోలీసుల విచారణలో తేలనుంది. త్వరలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు