TSLPRB Constable Recruitment: హైకోర్టు ఆర్డర్.. తెలంగాణ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్..
కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియకు సంబంధించి టీఎస్ఎల్పిఆర్బి కీలక ప్రకటన చేసింది. పోలిస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో భాగంగా తదుపరి ప్రక్రియను అంటే కానిస్టేబుళ్లకు మెడికల్ టెస్టులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది బోర్డ్. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది టీఎస్ఎల్పిఆర్బి. ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు, కమిషనర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది.