డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్–2 ఎగ్జామ్స్ జరగనున్నాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నెల 9 నుంచి టీజీపీఎస్సీ వెబ్ సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంతకు ముందే అనౌన్స్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.30గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.
రెండు సెషన్లలో..
ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-I జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ డిసెంబర్ 15, 2024న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహించబడతాయి, పేపర్-II, హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అంటే డిసెంబర్. 15, 2024. ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్‌తో కూడిన పేపర్-III డిసెంబర్ 1, 2024న ఉదయం 10 నుండి 12.30 గంటల మధ్య, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటుతో కూడిన పేపర్-IV అదే రోజు అంటే 2024 డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల మధ్య జరుగుతుంది.
తెలంగాణలో మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొదట గతేడాది ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అయితే వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది కమిషన్. ఆ తరువాత వాటిని కూడా మళ్ళీ రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైనల్‌గా డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి.
Also Read: Crime: కడపలో ప్రమోన్మాది ఘాతుకం..ఇంటికెళ్ళి మరీ కత్తితో పొడిచి..