హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. అటువైపు ఫుల్ ట్రాఫిక్ జామ్!

హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. గంటసేపటి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌‌నగర్‌ సహా పలు ప్రాంతాల్లో కురుస్తోంది. దీంతో రోడ్ల పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

New Update
HYD RAIN

హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. గంటసేపటి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు బాగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నిజాంపేట, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌, ఖైరతాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్ల పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 

ఇది కూడా చదవండి: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం

ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్..

Also Read: కత్తులతో నరికి ఎలా చంపారంటే?.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి !

కాగా నైరుతి బంగాళాఖాతం కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వాతావరణ శాఖ రీసెంట్‌గా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, హైదరాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాతావరణంలో మార్పులు వల్ల నిన్నటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.

Also Read:  పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్ష సూచనలు

ఏపీలో మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నాన్నారు. పొలాల్లో ఉరుములు, మెరుపులు కూడా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్ల చెట్ల కింద ఎవరూ ఉండకూడదని హెచ్చరించారు. అలాగే మృత్సకారులు వేటకు వెళ్లవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. 

Also Read:  అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!

దానా తుపాను

ఇదిలా ఉండగా.. ఇటీవల దానా తుపాను వచ్చింది. ఈ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటుగా ఏపీలో ఎక్కువగా ఉండేది. ఈ తపాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీగా వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్రలోని కళింగ పట్నం, భావనపాడు పోర్టులకు రెండో నంబర్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉత్తరాంధ్రలో ఈ తుపాను వల్ల భారీ వర్షాలు కురిశాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు