తెలంగాణలో ప్లాట్లు కొన్నవారికి అలర్ట్.. LRS రిజిస్ట్రేషన్ రూల్స్ ఇవే..

ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం మార్చి 31వరకు రాయితీ కల్పించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ విధానం, రూల్స్ మున్సిపల్ అధికారులు వెల్లడించారు. FTL, ప్రభుత్వ భూముల పక్కనలేని ప్లాట్ల దరఖాస్తుకు ఆటోమేటెడ్‌గా ఫీజు జనరేట్ అవుతుంది.

New Update
LRS registration

LRS registration Photograph: (LRS registration)

రాష్ట్రంలో ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసేవారికి పురపాలక శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) కింద విధివిధానాలు ప్రకటించింది. మార్చి 31లోగా ఎల్‌ఆర్ఎస్ ఫీజులో ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిందే. చెరువుల ఎఫ్టీఎల్‌కు 200 మీటర్ల పరిధిలోని, ప్రభుత్వ భూములకు అనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహా మిగతా సర్వే నంబర్లలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్‌గా ఫీజు ఫిక్స్ అవుతుంది. పురపాలకశాఖ ఇటీవల జారీచేసిన జీవో 28 ప్రకారం మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుంది. ఫీజు చెల్లించిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు. ప్లాటు జీవో నిబంధనలకు లోబడి ఉంటేనే క్రమబద్ధీకరణకు ప్రొసీడింగ్స్ జారీచేస్తారు. లేదంటే తిరస్కరించడంతో పాటు ఫీజులో పదిశాతం ప్రాసెసింగ్ కింద మినహాయించి, మిగతాది చెల్లిస్తారు. 

Also Read: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!

రిజిస్ట్రేషన్‌కు గైడ్‌లైన్స్

ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ల జాబితాను సిద్ధం చేసి సీజీజీకి పంపించాలి. ఈ సర్వే నంబర్లలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలనకు రెవెన్యూ శాఖకు పంపించాలి. 

చెరువులు, నీటివనరుల వద్ద ఎఫ్టీఎల్ పరిధి నుంచి 200 మీటర్ల పరిధిలోని భూములను సర్వే నంబర్ల వారీగా గుర్తించి వాటిని సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచేందుకు సంబంధిత అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్‌కు పంపించాలి. ఈ సర్వే నెంబర్లలోని దరఖాస్తుల్ని క్షేత్రస్థాయి పరిశీలన కోసం నీటిపాదురదల, రెవెన్యూ శాఖలకు పంపించాలి. ఈ పని అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ చేస్తుంది. 

నీటిపారుదల, రెవెన్యూశాఖలకు సిఫార్సు చేసిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారుల సిఫార్సుల ఆధారంగా మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు తదుపరి ప్రక్రియ చేపట్టాలి.

Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!

ఎల్‌‌ఆర్ఎస్ రిజిస్ట్రేషన్

ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీకి ముందుగా వేసిన లేఅవుట్లలోని ప్లాట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ ఆన్‌లైన్ లింకు ద్వారా దరఖాస్తుదారు పూర్తిసమాచారం అందించాలి. ఈ ప్లాట్లు అనధికార లేఅవుట్లో 26.08.2020 నాటికి ఉంటూ.. అంతకుముందు అందులో కనీసం పది శాతం ప్లాట్లు సేల్‌డీ‌డ్ ద్వారా విక్రయం జరిగి ఉండాలి. దరఖాస్తుదారు సబ్ రిజిస్ట్రార్‌కు దీనికి డాక్యుమెంట్ సమర్పించడంతో పాటు కటాఫ్ తేదీ నాటికి ముందు విక్రయించిన ప్లాట్ల వివరాలు, దస్తావేజు పత్రాలను వెల్లడించాలి. ఎస్ఆర్ఎస్-2020లో దరఖాస్తు చేసి ఉంటే.. అవసరమైన సమాచారాన్ని ఎల్ఆర్ఎస్ పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌కు బదిలీచేయాలి. 

రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారు వివరాలతో పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు వివరాలు నమోదు చేశాక తాత్కాలిక రుసుము జనరేట్ అవుతుంది. ఎల్ఆర్ఎస్ నిబంధనలకు లోబడి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్స్పేస్ ఛార్జీ (14%)లు చెల్లించాలి. ఈ చెల్లింపులు పూర్తయిన తరువాతే ప్లాటు రిజిస్ట్రేషన్ చేస్తారు. అనంతరం ఎల్ఎఆర్ఎస్ దరఖాస్తు, వసూలు చేసిన ఫీజుల వివరాలను సబజిస్ట్రారు ఎల్ఆర్ఎస్ పోర్టల్కు పంపించాలి. 
సబ్ రిజిస్ట్రార్ నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి, ఆమోదిస్తే.. ప్లాటు కొనుగోలుదారుడి పేరిట ప్రొసీడింగ్స్ జారీఅవుతాయి. దరఖాస్తుదారులు ప్రస్తుతం ఓపెన్స్పేస్ ఛార్జీలు చెల్లించకున్నా భవన నిర్మాణ అనుమతి సమయంలో ఆ మొత్తం చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే అప్పుడు 25 శాతం రాయితీ వారికి వర్తించదు. 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు