/rtv/media/media_files/2024/10/17/SfRFlOUSMH6VBzMkAmcX.jpg)
Kadiyam Srihari
Kadiyam Srihari : పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని కోరుతూ 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. కాగా స్పీకర్ నోటీసులకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. నా నాయకత్వం మీద నమ్మకంతో ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారని ఆయన అన్నారు, ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. ప్రజలకు నేనిచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోనని అనుమానం కలిగింది. అందుకే ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని కడియం అన్నారు. తను అడిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ కు సాగునీరు ఇవ్వడం కోసం రూ.148 కోట్ల నిధులిచ్చారు. లింగాల ఘనపురం చెరువుకు పూర్వ వైభవం తీసుకువచ్చినట్లు తెలిపారు.జీడికల్ దేవుడి చెరువుకు కూడా గోదావరి నీళ్లను తీసుకెళ్లామని శ్రీహరి తెలిపారు.
రాజీనామా చేయ్..శ్రీహరికి పోస్టుకార్డులు
కాగా బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి రాజీనామా చేయాలని నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఓ మహిళా ఓటరు డిమాండ్ చేసింది. ‘నా అమూల్యమైన ఓటుతో గెలిచావు.. కాంగ్రెస్ పార్టీలో చేరినావు.. ఇప్పుడేమో రైతులను అరిగోస పెడుతున్నవు.. వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకోవాలి’ అని సూచిస్తూ జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రానికి చెందిన ఉడుగుల భాగ్యలక్ష్మి పోస్టుకార్డు రాసింది. బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోతో బరిలో నిలిచిన కడియం రాజీనామా చేయాలని నియోజక వర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల శ్రమతో గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే తన పదవికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో గులాబీ శ్రేణులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గురువారం స్టేషన్‌ఘన్‌పూర్‌లోని మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కన్వీనర్ కనకం గణేశ్ ఆధ్వర్యంలో కడియం రాజీనామా చేయాలంటూ హనుమకొండలోని ఆయన ఇంటి అడ్రస్‌కు బీఆర్‌ఎస్ శ్రేణులు పోస్టు కార్డులు పంపించారు.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచిన కడియం ఇప్పటికైనా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు కోరుతున్నారు, లేని పక్షంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కడియం ఇంటికి, స్పీకర్‌కు కూడా పోస్టు కార్డు లు పంపించే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కడియం ను, గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ప్రజలకు కడియం అండగా ఉంటాడని నమ్మి గెలిపించామని, నెల రోజులుగా రైతులు యూరియా కోసం తిండీతిప్పలు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని నియోజక వర్గానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఆత్మగౌరవం పోయాక పదవులు ఎందుకు.. ఈటల సంచలన కామెంట్స్!