/rtv/media/media_files/2026/02/14/fotojet-5-2026-02-14-15-48-16.jpg)
Ananya, Nagesh, Premender
Municipal elections : ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలు భిన్నమైన రిజల్ట్స్‌ను తీసుకొచ్చాయి. ఇన్నాళ్లు తండ్రిచాటున ఉండి ఆయన విజయం కోసం పాటుపడుతున్న పలువురు వారసులు ఎన్నికల్లో పోటీ చేయడమే కాక ఏకంగా మున్సిపల్ చైర్మన్ బరిలో నిలవడం గమనార్హం. గతంలోనూ చాలామంది వారసులు రాజకీయ రంగ ప్రవేశం చేసి విజయం సాధించినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ప్రజలు ఆ పార్టీవైపే మొగ్గు చూపారు.దీంతో ఆ పార్టీకే ఎక్కువ మున్సిపాలిటీలు దక్కాయి. ఈ సారి కూడా పలువురు వారసులు రాజకీయాల్లో తమ భవిష్యత్తును పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. ఆ వారసుల్లో పలువురు విజయం సాధించగా.. కొందరు ఓటమి పాలయ్యారు.
వికారాబాద్​లో కాంగ్రెస్​ నుంచి ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు అనన్య (24) 17వ వార్డు నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే నారాయణఖేడ్​లో జహీరాబాద్ ఎంపీ సురేశ్​ షెట్కార్ ​తమ్ముడు నరేశ్​ షెట్కార్​ విజయం సాధించారు. కేవలం గెలవడమే కాకుండా వారు చైర్ పర్సన్​ రేసులోనూ ఉన్నారు. వికారాబాద్​ మున్సిపల్ చైర్ పర్సన్​ స్థానాన్ని ఎస్​సీ మహిళకు రిజర్వ్​ చేయడంతో అతిపిన్న వయస్సులో అనన్య (24) కు ఆ పదవి లాంఛనం అయ్యింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఎంపీ సురేశ్​ షెట్కార్​ సోదరుడు నగేశ్ ​షెట్కార్​ 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం గెలుపొందారు. ఖేడ్​లో 15 వార్డులకుగాను కాంగ్రెస్ 11 చోట్ల విజయంసాధించింది. ఇదివరకే నగేశ్​ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చైర్ పర్సన్​గా ఆయన ఎంపిక ఖాయమైనట్టే.
ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 34వ వార్డు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జోగు రామన్న కుమారుడు జోగు ప్రేమేందర్ పరాజయం ఓటమి పాలయ్యారు. 34వ వార్డులో ఆయన పోటీ చేయగా అక్కడ ఎంఐఎం అభ్యర్థి నజీర్ అహ్మద్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు.దీంతో జోగు ప్రేమేందర్ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఒకప్పుడు ఆయన ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా పనిచేయడం గమనార్హం.
Follow Us