Chilkur Balaji Temple : రామరాజ్య స్థాపన కష్టమేం కాదు....చినజీయర్ స్వామి సంచలన కామెంట్స్

చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ పై జరిగిన దాడిని చినజీయర్ స్వామి ఖండించారు.సోమవారం చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ఆలయ అర్చకుల పరిస్థితి బాగోలేదన్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటే రాజరాజ్య స్థాపన కష్టమేం కాదన్నారు.

New Update
 Chinna Jeeyar Swamy

Chinna Jeeyar Swamy

Chilkur Balaji Temple : చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ పై జరిగిన దాడిని చినజీయర్ స్వామి ఖండించారు. సోమవారం చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ఆలయ అర్చకుల పరిస్థితి బాగోలేదని అన్నారు. వారికి అండగా ఉండాల్సింది పోయి దాడులు చేయడం సరికాదన్నారు. రామరాజ్యం కోరుకోవడంలో తప్పులేదని అయితే అది రాజ్యాంగబద్ధంగా జరగాలని అన్నారు. ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటే రాజరాజ్య స్థాపన కష్టమేం కాదన్నారు. అయితే సమాజంలో హింసకు తావులేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులపై చర్యలు తీసుకోవలన్నారు.

ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!

 రంగరాజన్‌ పై దాడి జరుగడాన్ని మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. సోమవారం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. రామరాజ్యం పేరుతో చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మరియు నిర్వాహకులు అయిన రంగరాజన్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి దానికి రాముడి పేరును వాడుకుంటూ రాముడి పేరును బద్నాం చేస్తూ అరాచక, అనాగరిక చర్యలకు పాల్పడటం దుర్మార్గం అని అన్నారు. ఇది రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్యగా పేర్కొన్నారు.

Also Read: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్‌ కంపెనీలు

హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల పోలీసులు, ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ అప్రమతంగా ఉండాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు, అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ధర్మాన్ని కాపాడుతూ సమాజ హితం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న అర్చకులపై ఇలాంటి దాడులు జరగడం అమానుషం అని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే

శుక్రవారం రోజున రంగరాజన్‌ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేశారు. మొత్తం 20 మంది ఆయనపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. రామరాజ్య స్థాపనకు తనకు మద్ధతు ఇవ్వాలని కోరిన వీరరాఘవరెడ్డి అనే వ్యక్తికి మద్ధతు ఇవ్వనందునే ఆయన పై దాడి జరిగినట్లు చెబుతున్నారు. రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి ఆదివారం ఒకరిని అరెస్టు చేసినట్టు మొయినాబాద్‌ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Also Read: కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు