TGSRTC బంపరాఫర్..  ఈ రూట్లలో 30% డిస్కౌంట్.. అస్సలు మిస్ అవ్వొద్దు!

హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ రూట్‌లో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై 16% నుంచి 30% వరకు రాయితీ అందించనున్నట్లు సంస్థ తన అధికారిక ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

New Update
tsrtc

హైదరాబాద్ - విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ రూట్‌లో నడిచే బస్సుల్లో టికెట్ ధరలపై 16% నుంచి 30% వరకు రాయితీ అందించనున్నట్లు సంస్థ తన అధికారిక ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. గరుడ ప్లస్ బస్సులు: టికెట్ ధరపై 30% రాయితీ, ఈ-గరుడ బస్సులు: 26% డిస్కౌంట్, సూపర్ లగ్జరీ, లహరి (నాన్-ఏసీ) బస్సులు: 20% డిస్కౌంట్, రాజధాని, లహరి (ఏసీ) బస్సులు: 16% డిస్కౌంట్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.  ఈ ఆఫర్లు ప్రస్తుతం అమలులో ఉన్నాయి.

ముందస్తు రిజర్వేషన్లు చేసుకునే వారికి

ముందస్తు రిజర్వేషన్లు చేసుకునే వారికి కూడా ఈ రాయితీలు వర్తిస్తాయని టీజీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. అయితే అంతకుముందు టీజీఎస్‌ఆర్టీసీ ఈ మార్గంలో 10% డిస్కౌంట్‌ను  ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ఆఫర్లు మరింత ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశ్యంతో ఈ రాయితీలను కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం TGSRTC అధికారిక వెబ్‌సైట్: https://www.tgsrtc.telangana.gov.in/ లేదా ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్స్ (RedBus, AbhiBus, MakeMyTrip, Goibibo)లలో కూడా ఈ ఆఫర్లను చూడవచ్చు. 

Advertisment
తాజా కథనాలు