/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
టీజీపీఎస్సీ గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి 10న గ్రూప్-1 ప్రొవిజన్ మార్కులు విడుదల చేయనుంది. 11న గ్రూప్-- -2 జనరల్ ర్యాకింగ్ జాబితాను రిలీజ్ చేయనుంది. మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనుంది. అలాగే మార్చి 17న హాస్టల్ వెల్ఫెర్ ఆఫీసర్, 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేయనుంది.
Also Read: మేఘాకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు?
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తోంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. దీని ప్రకారం చూసుకుంటే ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు.
Also Read: రేవంత్, కేసీఆర్‌కు స్టాలిన్ సంచలన లేఖ.. ఎందుకో తెలుసా ?
783 ఖాళీల భర్తీ కోసం డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష జరిగింది. ఇక 1,365 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 3 పరీక్షలు గతేడాది నవంబర్ 17,18న జరిగాయి. మొత్తం 3 పేపర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. గ్రూప్స్ పరీక్షలు ముగియడంతో అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల ఫలితాల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే