Group-1:పరీక్ష జరిగినా రద్దు కావడం ఖాయం.. గ్రూప్-1 అభ్యర్థుల వాదన ఇదే!

మరికొన్ని గంటల్లో GROUP-1 పరీక్ష జరగనుంది. నిన్నటి వరకు ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేశారు. ఈ రోజు ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరగనుంది. అయితే.. మెజార్టీ అభ్యర్థులు మాత్రం పరీక్ష జరిగినా తర్వాత రద్దు కావడం ఖాయమని అంటున్నారు.

TSPSC Group-1 Exam Updates
New Update

మరికొన్ని గంటల్లో గ్రూప్-1 ఎగ్జామ్ జరగనుంది. పరీక్ష కోసం టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఈరోజు సుప్రీంకోర్టులో పరీక్షపై ఈ రోజు విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఆఖరి నిమిషంలో కోర్టు పరీక్షను ఆపే ఆవకాశం లేదన్న భవన సర్వత్రా వ్యక్తం అవుతోంది. కానీ.. పరీక్ష నిర్వహించినా రద్దు కాక తప్పదని అనేక మంది అభ్యర్థులు చెబుతున్నారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేసే సమయంలో జీవో.29 కారణంగా రిజర్వేషన్ అభ్యర్థులు నష్టపోయారని చెబుతున్నారు. ఇంకా ట్రాన్స్ జెండర్లు, ఎస్టీ, స్పోర్ట్స్, నాన్ లోకల్, EWS ఇలా అనేక వివాదాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం తేలకముందు పరీక్ష నిర్వహించడం సరికాదని వాదిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మరికొన్ని గంటల్లో గ్రూప్-1 పరీక్ష.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సంచలన లేఖ

అభ్యర్థుల వాదనలు ఇలా ఉన్నాయి..

1. దివ్యాంగుల రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రకారం తీసుకోకుండా జనరల్ గా తీసుకున్నారని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రతీ కేటగిరీలోనూ దివ్యాంగులకు రిజర్వేషన్లు అప్లై చేయాలని అంటున్నారు. ఇది కూడా కోర్టు ముందు నిలవదని చెబుతున్నారు. 
2. ట్రాన్స్ జెండర్లకు 3 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. కానీ ఇందుకు సంబంధించిన ఎలాంటి గైడ్ లైన్స్ లేవని అంటున్నారు.
3. జనాభా ఆధారంగా ఎస్టీ రిజర్వేషన్లను10 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చారని.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెంచడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: TGPSC: బీసీ బిడ్డగా చెబుతున్నా.. గ్రూప్-1పై టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన

4. గతంలో కేవలం అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వారికే గ్రూప్-1లో స్పోర్ట్స్ కోటా కింద పరిగణించేవారని.. కానీ ఇటీవల జాతీయ స్థాయి అని రూల్స్ మార్చారని.. ఇది కూడా చెల్లదని అంటున్నారు. 
5. రాష్ట్రంలో నాన్ లోకల్ అభ్యర్థులకు 5 శాతం రిజర్వేషన్లు ఉందని.. అయితే.. గ్రూప్-1లో కొన్ని మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను ఏ జోన్ కు కేటాయిస్తారు? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై కూడా క్లారిటీ లేదని అంటున్నారు. 
7.ముఖ్యంగా జీఓ 29 ప్రకారం ప్రిలిమ్స్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు జనరల్ కోటాలో అర్హత సాధించినా.. వారిని వారి రిజర్వేషన్ వర్గానికే పరిమితం చేశారు. దీంతో అనేక మంది రిజర్వ్ కోటా అభ్యార్థులు అర్హత కోల్పోయారని వాదిస్తున్నారు. ఇది కూడా సుప్రీంకోర్టులో నిలవదన్న వాదన వినిపిస్తోంది. 

Also Read :  మాస్ స్టెప్‌లతో డ్యాన్స్ అదరొగొట్టిన మాజీమంత్రి .. నెట్టింట వైరల్!

Also Read :  దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం

#supreme-court #tgpsc-group-1
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe