TG Caste Census: తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే కులగణన కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రతి కుటుంబ సమగ్ర సమాచారాన్ని సేకరించేలా 54 ప్రశ్నలతో కూడిన 7 పేజీలను రూపొందించిన ప్రణాళిక శాఖ.. ఇప్పుడు ఆస్తులు, రిజర్వేషన్ల ద్వారా లబ్దిపొందిన వివరాలను సేకరించేలా కొత్త ఫార్మాట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటి నంబర్లకు ప్రత్యేక కోడ్ కేటాయించి పూర్తి సమాచారాన్ని నమోదు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇది ఎలా అమలు చేయనున్నారు? ఆర్థిక, ఉద్యోగ, ఆదాయ పన్ను చెల్లింపుదారులే గుర్తిస్తారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
మొదటి దశ.
మొదట కుటుంబ సభ్యుల సంఖ్య సేకరిస్తారు. ఆ తర్వాత కుటుంబ యజమాని, సభ్యులు, యజమానితో సంబంధం, జెండర్, మతం, కులం/సామాజిక వర్గం, ఉప కులం, కులానికి సంబంధించిన ఇతర పేర్లు, వయసు, మాతృభాష, ఆధార్ నంబర్ సేకరించనున్నారు.
రెండో దశ
ఓటర్ ఐడీ కార్డు. దివ్యాంగులైతే దాని పూర్తి వివరాలు. మ్యారిడ్, అన్ మ్యారిడ్. వివాహ కాలం నాటికి వయసు, ఆరేళ్ల వయసులోపు పాఠశాలలో చేరారా లేదా?, ఏ పాఠశాల. విద్యార్హతలు, 6–16 ఏళ్ల మధ్య బడి మానేస్తే ఆ సమయానికి చదువిన తరగతి, బడి మానేయటానికి కారణాలు, 17–40 ఏళ్లలోపు వారు విద్యను కొనసాగించకపోవడానికి గల కారణాలు, నిరక్షరాస్యులవడానికి కారణాల వివరాలను సేకరిస్తారు.
ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!
మూడో దశ
ప్రస్తుతం చేస్తున్న వృత్తి, స్వయం ఉపాధి. దాని వివరాలు. రోజువారీ వేతనం ఎంత? ఏ రంగంలో పనిచేస్తున్నారు?. కులవృత్తి ఏమిటి, ప్రస్తుతం కులవృత్తిని కొనసాగిస్తున్నారా? కులవృత్తి కారణంగా వ్యాధులబారినపడ్డారా?. వార్షికాదాయం, ఆదాయ పన్ను కడుతున్నారా?, బ్యాంకు ఖాతా ఉందా లేదా? వంటివి
నాలుగో దశ
రిజర్వేషన్ ద్వారా లబ్ది పొందిన విద్య ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన కుల ధ్రువీకరణ పత్రం ఉందా? లేదా?. సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందిన వారా?, రాజకీయ నేపథ్యం ఏమిటి?, ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు?. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధిగా పనిచేశారు. నామినేటెడ్ లేదా కార్పొరేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థలలో సభ్యులుగా ఉన్నారా? వంటివి రికార్డు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Diwali: ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? పండితులు చెబుతున్న డేట్ ఇదే!
ఐదొవ దశ
కుటుంబం పేరుమీద ఎంత భూమి ఉంది. ధరణి పాస్‌బుక్, పాస్‌బుక్ నంబర్, భూమిరకం వివరాలు. తర్వాత ఆ భూమి వారసత్వమా? సొంతంగా కొన్నదా? బహుమతిగా వచ్చిందా?, అసైన్డ్ భూమా?, అటవీ హక్కుల ద్వారా పొందినదా? అనే వివరాలు. అలాగే భూమికి ప్రధాన నీటి వనరు, ఎన్ని పంటలు పండుతాయి, ఏమైనా రుణాలు తీసుకున్నారా?, ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు?, ఎక్కడి నుంచి తీసుకున్నారు?, వ్యవసాయ అనుబంధంగా ఏదైనా పనిచేస్తున్నారా?
ఆరొవ దశ
కుటుంబానికి చెందిన పశుసంపద వివరాలను కూడా రికార్డుల్లో పొందుపరచనున్నారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతులు, ఇతరత్ర పెంపుడు జీవులను సైతం లెక్కించనున్నారు. వాటినుంచి వచ్చే ఆదాయం? ప్రభుత్వం సహాకారంపై ఆరాతీయనున్నారు.
ఇది కూడా చదవండి: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
ఏడొవ దశ
కుటుంబ ఆస్తులకు సంబంధించి.. స్థిరా, చరాస్తుల వివరాలు. ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాస గృహం రకం, మరుగుదొడ్డి, వంట కోసం ఉపయోగించే ఇంధనం, ఇంటికి విద్యుత్ సదుపాయం వంటి వివరాలను సేకరించనున్నారు.