మిరుమిట్లు గొలిపే లైట్లు, లేర్ షోలు, డీజే మోతలుతో తెలుగు రాష్ట్రాలు దద్ధరిల్లుతున్నాయి. యువత కేరింతల నడుమ తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం వేడుకలు అంబరాన్నంటాయి. రేపటి మీ ఆశతో...వచ్చే ఏడాదిలో మరింత మంచి జరుగుతుందనే ఉత్పాహంతో అందరూ న్యూ ఇయర్ ఎండ్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు ప్రోగ్రాములు,, డీజేలు, డాన్స్‌లతో యువత హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లోపెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వరంగల్, గుంటూరు, రాజమహేంద్రవరం అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సందడి చేస్తున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు కిటకిటలాడుతున్నాయి. ఎవరి టేస్ట్‌కు తగ్గట్టు వారు ఆనందంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ పండుగ అన్నిచోట్లా పండుగ వాతావరణం తీసుకువస్తున్నారు. Also Read: Year Ender 2024:వేల కోట్లను నష్టపోయిన బ్యాంకులు..వాటి లిస్ట్ ఇదే..