TG Crime: యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైతు ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ఇంజన్ పైకి లేచింది. దీంతో నాగలి, ఇంజన్ మధ్య చిక్కుకున్న ఆ అన్నదాత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఎన్ కౌంటర్.. 20 ఏళ్లకు చిక్కిన విక్రమ్ గౌడ!
పొలం దున్నడానికి వెళ్లి మృత్యువాత..
స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్ పి.మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన పెద్దగోని నర్సింహ(54)కు సొంత ట్రాక్టర్ ఉంది. వ్యవసాయంతోపాటు ట్రాక్టర్ నడుపుతూ ఆయన జీవనం కొనసాగిస్తున్నారు. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దున్నడానికి వెళ్లారు. అయితే.. ట్రాక్టరు టైర్లు పొలం బురదలో దిగబడింది. ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: జవాన్‌కి పునర్జన్మ.. 90 నిమిషాల తర్వాత మళ్ళీ కొట్టుకున్న గుండె
ఇంజిన్ ఇకే సారి పూర్తిగా పైకి లేచింది. దీంతో నర్సింహ ఇంజిన్, ట్రాక్టరు వెనక ఉన్న నాగలి మధ్య ఇరుకున్నాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి కష్టం మీద మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలంలో మృతదేహాన్ని చూసి బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలం వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లయ్య తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నర్సింహ మృతితో వారు దిక్కులేనివారయ్యారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఫుడ్ ప్యాకింగ్‌కు అల్యూమినియం ఎలా ఉపయోగించాలి?
ఇది కూడా చదవండి: మనుషులను చంపేస్తున్న మూఢనమ్మకాలు.. పాముకాటు తర్వాత ఇలా చేస్తే అంతే సంగతి!