తెలంగాణ స్థానిక ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే జనవరిలో షెడ్యూల్ విడుదల చేసి.. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ప్లాన్ గా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర కుటుంబ, రాజకీయ, ఆర్థిక సర్వే కొనసాగుతోంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయనుంది. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. రెండు టర్మ్ ల వరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను మార్చడం కుదరదు. ఇప్పుడు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచాలంటే ఆ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. కేవలం ఇదొక్కటే కాకుండా గత పంచాయతీ రాజ్ చట్టానికి అనేక మార్పులను చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. పాత పంచాయతీ రాజ్ చట్టానికి ప్రభుత్వం తీసుకురానున్న సవరణల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Job Notification: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..
ఉప సర్పంచ్ కు చెక్ పవర్ రద్దు..
గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉండేది. అయితే.. 2018లో బీఆర్ఎస్ సర్కార్ తీసుకువచ్చిన పంచాయతీ రాజ్ చట్టంలో ఆ విధానం రద్దు చేశారు. సెక్రటరీ స్థానంలో ఉప సర్పంచ్ కు జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. అయితే.. ఇలా చేయడం ద్వారా అనేక గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య విభేదాలు తలెత్తుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రభావం పల్లెల అభివృద్ధిపై పడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సర్పంచ్, సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఉండేలా చట్టంలో సవరణలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Big Breaking: భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి!
ప్రతీ టర్మ్ లో రిజర్వేషన్లు మారేలా..
ప్రతీ రెండు టర్మ్ లకు ఒక సారి రిజర్వేషన్లు మార్చేలా గత బీఆర్ఎస్ సర్కార్ చట్టంలో మార్పులు చేసింది. ప్రతీ టర్మ్ కు ఓ సారి రిజర్వేషన్ మారడం ద్వారా ఎన్నికైన వారు సరిగా పని చేయలేకపోతున్నారని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. తమకు మళ్లీ అవకాశం ఉండదని ఎన్నికైన వారు అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదని తెలిపింది. అయితే.. ప్రతీ ఏటా రిజర్వేషన్లు మారేలా సవరణలు తీసుకురావాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
సర్పంచ్ లకు సస్పెండ్ చేసే అధికారం రద్దు..
సర్పంచ్ లను సస్పెన్షన్ చేసే అధికారాన్ని గత పంచాయతీ రాజ్ చట్టం కలెక్టర్లకు కల్పించింది. అయితే.. ప్రజలతో ఎన్నికైన వారిని కలెక్టర్లు తొలగించడం ఏంటన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ లపై వేటు వేసే అధికారాన్ని కలెక్టర్ల నుంచి తప్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
ఎంత మంది పిల్లలు ఉన్నా ఓకే..
పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను కూడా సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేసే అవకాశాన్ని కల్పించేలా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తీసుకురానుంది రేవంత్ సర్కార్.